AP News: ‘ఆడదాం ఆంధ్రా’లో.. కొట్టుకున్న విద్యార్థులు.. చిత్తూరు జిల్లాలోని కుప్పంలో రసాభాసగా పోటీలు
చిత్తూరు జిల్లా కుప్పంలో నిర్వహించిన ఆడదాం ఆంధ్రా క్రీడా పోటీలు రసాభాసగా మారిపోయాయి. విద్యార్థులు రెండుగా చీలిపోయి భౌతిక దాడికి దిగారు. పిడిగుద్దులు కురిపించుకున్నారు. కర్రలతో దాడులు చేసుకున్నారు.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న క్రీడా పోటీలు చిత్తూరులో రసాభాసగా మారాయి. ఆడుదాం ఆంధ్ర నిర్వహిస్తున్న ఈ పోటీల్లో విద్యార్థులు కొట్టుకున్నారు. విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి భౌతిక దాడులు చేసుకున్నారు. దీంతో ద్రావిడ యూనివర్సిటీలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
కుప్పంలో "ఆడుదాం ఆంధ్ర"లో కొట్టుకున్న ఆటగాళ్ళు. pic.twitter.com/EBlBt2lAKD
— Telugu Scribe (@TeluguScribe) January 10, 2024
చిత్తూర జిల్లా కుప్పంలో ఈ పోటీలు బుధవారం నిర్వహించారు. ఇక్కడ ‘ఆడదాం ఆంధ్రా’ కార్యక్రమం ‘కొట్టుకుందాం ఆంధ్రా’గా మారిపోయింది. ద్రావిడ యూనివర్సిటీలో ఆడదాం ఆంధ్రా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
Also Read: టికెట్ రాని వాళ్లే అదృష్ట వంతులు.. ఈ రాజకీయాల్లో ఖర్చు తప్ప రాబడి నిల్ : దగ్గుబాటి సంచలన వ్యాఖ్యలు
‘ఆడదాం ఆంధ్రా’ కార్యక్రమంలో కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో కనుమలపల్లి, కాడేపల్లి జట్టు పోటీ పడ్డాయి.ఈ జట్ల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కబడ్డీ ఆటలో తలెత్తిన ఓ వివాదంతో ఈ రెండు జట్ల మధ్య ఘర్షణలు జరిగాయి. పరస్పరం విద్యార్థులు దాడి చేసుకున్నారు.
ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. విచక్షణారహితంగా దాడి చేసుకున్నారు. అక్కడున్న ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. కర్రలతో దాడి చేసుకున్నారు. కానీ, వర్సిటీ అధికారులు, కార్యక్రమ నిర్వాహకులు ఈ దాడి తీవ్ర రూపం దాల్చకుండా అడ్డుకోవడం విఫలం అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.