Asianet News TeluguAsianet News Telugu

సీఎం సీరియస్.. వివాహితను రూమ్‌కి పిలిచిన సీఐపై విచారణకు ఆదేశం

ఓ కేసు విషయమై పరిచయమైన వివాహితను రూమ్‌కు రావాలంటూ వేధింపులకు గురిచేసిన చిత్తూరు జిల్లా వాయల్పాడు సీఐ తేజోమూర్తిపై జిల్లా ఎస్పీ విచారణకు ఆదేశించారు. 

chittoor SP orders for departmental enquiry against vayalpad ci tejomurthy
Author
Chittoor, First Published Sep 20, 2018, 12:22 PM IST

ఓ కేసు విషయమై పరిచయమైన వివాహితను రూమ్‌కు రావాలంటూ వేధింపులకు గురిచేసిన చిత్తూరు జిల్లా వాయల్పాడు సీఐ తేజోమూర్తిపై జిల్లా ఎస్పీ విచారణకు ఆదేశించారు. సీఐ వ్యవహారంపై మీడియాలో కథనాలు రావడం.. అది ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లింది. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు.

సీఐపై తక్షణం క్రిమినల్ కేసు నమోదు చేయాలని.. శాఖాపరమైన విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ.. సీఐపై విచారణకు ఆదేశించారు. విచారణాధికారిగా మదనపల్లి డీఎస్పీ చిదానందరెడ్డిని నియమించారు.

తేజోమూర్తిపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఓ కేసులో విషయంలో స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వచ్చిన వివాహితను సీఐ సిద్ద తేజా మూర్తి అసభ్యంగా వ్యవహరించాడు. తరచూ ఫోన్ చేయడంతో పాటు.. అసభ్య సందేశాలు, చిత్రాలు పంపేవాడు..

తాజాగా తిరుమల బ్రహ్మోత్సవాల విధుల్లో ఉన్న సీఐ రూమ్ బుక్ చేశానని.. తిరుమలకు వచ్చి కోరిక తీర్చాలని వేధించడంతో ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన కర్నూలు రేంజ్ డీఐజీ.. సీఐని విధుల నుంచి తొలగించారు.

వివాహితను ట్రాప్ చేసిన సీఐ.. తిరుమలలో రూం బుక్.. వస్తావా..? రావా..? (ఆడియో)

మహిళల జోలికొస్తే తాట తీయండి.. వాయల్పాడు సీఐపై చంద్రబాబు ఆగ్రహం

వివాహితను వేధించిన సీఐ : కానిస్టేబుళ్లకు డబ్బు కావాలి.. సీఐకి ఆమె కావాలి

Follow Us:
Download App:
  • android
  • ios