Asianet News TeluguAsianet News Telugu

మహిళల జోలికొస్తే తాట తీయండి.. వాయల్పాడు సీఐపై చంద్రబాబు ఆగ్రహం

కేసులో న్యాయం చేయాలని స్టేషన్‌కొచ్చిన మహిళలను వేధింపులకు గురిచేసిన చిత్తూరు జిల్లా వాయల్పాడు సీఐ సిద్ధ తేజమూర్తి వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫైరయ్యారు.

CM Chandrababau naidu fires on CI sexul harrasement case
Author
Amaravathi, First Published Sep 19, 2018, 12:44 PM IST

కేసులో న్యాయం చేయాలని స్టేషన్‌కొచ్చిన మహిళలను వేధింపులకు గురిచేసిన చిత్తూరు జిల్లా వాయల్పాడు సీఐ సిద్ధ తేజమూర్తి వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫైరయ్యారు. సీఐ వేధింపులపై ఉదయం నుంచి మీడియాలో కథనాలు రావడంతో విషయం సీఎం దాకా వెళ్లింది.

దీనిపై పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడిన చంద్రబాబు.. సీఐపై తక్షణం క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. శాఖాపరంగా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించే వారిపై కఠినంగా ఉండాలని సూచించారు.

బాధిత మహిళలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఓ కేసులో విషయంలో స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వచ్చిన వివాహితను సీఐ సిద్ద తేజా మూర్తి అసభ్యంగా వ్యవహరించాడు.

తరచూ ఫోన్ చేయడంతో పాటు.. అసభ్య సందేశాలు, చిత్రాలు పంపేవాడు.. తాజాగా తిరుమల బ్రహ్మోత్సవాల విధుల్లో ఉన్న సీఐ రూమ్ బుక్ చేశానని.. తిరుమలకు వచ్చి కోరిక తీర్చాలని వేధించడంతో ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన కర్నూలు రేంజ్ డీఐజీ.. సీఐని విధుల నుంచి తొలగించారు.

వివాహితను ట్రాప్ చేసిన సీఐ.. తిరుమలలో రూం బుక్.. వస్తావా..? రావా..? (ఆడియో)

Follow Us:
Download App:
  • android
  • ios