Asianet News TeluguAsianet News Telugu

వివాహితను ట్రాప్ చేసిన సీఐ.. తిరుమలలో రూం బుక్.. వస్తావా..? రావా..? (ఆడియో)

న్యాయం కోసం స్టేషన్‌కొచ్చిన వివాహితను ట్రాప్ చేసిన సీఐని ఉన్నతాధికారులు  సస్పెండ్‌ చేశారు. వివరాల్లోకి వెళితే.. సిద్ధ తేజామూర్తి చిత్తూరు జిల్లా వాల్మీకిపురం సీఐగా గత ఏప్రిల్‌లో బాధ్యతలు నిర్వహించారు.

ci traps married women.. suspend from service
Author
Tirupati, First Published Sep 19, 2018, 8:22 AM IST

న్యాయం కోసం స్టేషన్‌కొచ్చిన వివాహితను ట్రాప్ చేసిన సీఐని ఉన్నతాధికారులు  సస్పెండ్‌ చేశారు. వివరాల్లోకి వెళితే.. సిద్ధ తేజామూర్తి చిత్తూరు జిల్లా వాల్మీకిపురం సీఐగా గత ఏప్రిల్‌లో బాధ్యతలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆగస్టు 10 నుంచి పీలేరు సర్కిల్‌కు ఇన్‌స్పెక్టర్ లేకపోవడంతో అక్కడ ఇన్‌ఛార్జిగా విధులు నిర్వర్తించారు.

ఈ సమయంలో పీలేరుకు చెందిన ఓ భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో వారు న్యాయం కోసం స్టేషన్‌కు వచ్చారు. కేసు విషయంలో సిద్ధమూర్తి సదరు వివాహితను స్టేషన్‌కు పిలిపించారు. ఫోన్ నెంబర్ తీసు్కుని ఆమెతో అసభ్యంగా వాట్సాప్‌లో ఛాటింగ్ చేయడం ప్రారంభించాడు.

తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఐకి అక్కడ విధుల బాధ్యతలు అప్పగించారు. ఓ పక్క శ్రీవారి బ్రహ్మోత్స్వాలు జరుగుతుండగా మరో పక్క రాసలీలలు కోసం తహతహలాడిపోయాడు. నందకం రెస్ట్‌హౌస్‌లో రూమ్ బుక్ చేసి.. వివాహితకు ఫోన్ చేశాడు.. తిరుమలకు రావాలని వేధింపులకు గురిచేశాడు.

సీఐ వేధింపులతో సహనం నశించిన వివాహిత.. అతని ఆట కట్టించాలని మహిళా సంఘాలను వెంటబెట్టుకుని తిరుపతి అర్బన్ ఎస్పీని కలిసి... సీఐ తనతో అసభ్యంగా చేసిన ఛాటింగ్.. ఆడియో టేపులను ఆయనకు అందించింది. దీనిపై విచారణ జరిపిన కర్నూలు రేంజ్ డీఐజీ.. తేజమూర్తిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. 

                      "

Follow Us:
Download App:
  • android
  • ios