Asianet News TeluguAsianet News Telugu

వివాహితను వేధించిన సీఐ : కానిస్టేబుళ్లకు డబ్బు కావాలి.. సీఐకి ఆమె కావాలి

వివాహితను వేధించిన చిత్తూరు జిల్లా వాయల్పాడు సీఐ తేజోమూర్తి వ్యవహారంలో లోపలికి వెళ్లే కొద్ది కొత్త కోణాలు బయటపడుతున్నాయి. తన భర్తతో గొడవకు సంబంధించి స్టేషన్‌కు వెళ్లిన వివాహితను అక్కడి కానిస్టేబుళ్లు డబ్బు కోసం వేధించినట్లుగా తెలుస్తోంది.

new twist in vayalpad ci case
Author
Vayalpadu, First Published Sep 19, 2018, 1:24 PM IST

వివాహితను వేధించిన చిత్తూరు జిల్లా వాయల్పాడు సీఐ తేజోమూర్తి వ్యవహారంలో లోపలికి వెళ్లే కొద్ది కొత్త కోణాలు బయటపడుతున్నాయి. తన భర్తతో గొడవకు సంబంధించి స్టేషన్‌కు వెళ్లిన వివాహితను అక్కడి కానిస్టేబుళ్లు డబ్బు కోసం వేధించినట్లుగా తెలుస్తోంది.

ప్రతిసారి వూరికే వచ్చి వెళితే లాభం ఉండదని.. ఏదైనా ఇస్తేనే పనిజరుగుతుందని అక్కడి కానిస్టేబుళ్లు దస్తగిరి, సుబ్రమణ్యం, సాధిక్‌లు తనను వేధించినట్లు వివాహిత ఆరోపిస్తోంది. సాధిక్ అనే కానిస్టేబుల్‌కు డబ్బులు ట్రాన్స‌ఫరర్ చేశానని.. అకౌంట్లను పరిశీలిస్తే నిజానిజాలు బయటకు వస్తాయని ఆమె వాదిస్తోంది. చివరికి పోలీసుల వేధింపులు భరించలేక తాను కేసులు వద్దనుకున్నానని.. అయినప్పటికీ సీఐ తనను వదల్లేదని వివాహిత ఆవేదన వ్యక్తం చేసింది.

ఓ కేసులో విషయంలో స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వచ్చిన వివాహితను సీఐ సిద్ద తేజా మూర్తి అసభ్యంగా వ్యవహరించాడు. తరచూ ఫోన్ చేయడంతో పాటు.. అసభ్య సందేశాలు, చిత్రాలు పంపేవాడు.. తాజాగా తిరుమల బ్రహ్మోత్సవాల విధుల్లో ఉన్న సీఐ రూమ్ బుక్ చేశానని.. తిరుమలకు వచ్చి కోరిక తీర్చాలని వేధించడంతో ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన కర్నూలు రేంజ్ డీఐజీ.. సీఐని విధుల నుంచి తొలగించారు.

వివాహితను ట్రాప్ చేసిన సీఐ.. తిరుమలలో రూం బుక్.. వస్తావా..? రావా..? (ఆడియో)

మహిళల జోలికొస్తే తాట తీయండి.. వాయల్పాడు సీఐపై చంద్రబాబు ఆగ్రహం

Follow Us:
Download App:
  • android
  • ios