హైద్రాబాద్ లో ఉచిత హలీం ఆఫర్: హోటల్ కు పోటెత్తిన జనం, లాఠీచార్జీ (వీడియో)
ఉచిత హలీం కోసం ఓ హోటల్ చేసిన ప్రచారం చివరకు స్వల్ప లాఠీ చార్జీకి దారి తీసింది. ఈ ఘటన హైద్రాబాద్ లో చోటు చేసుకుంది.
హైదరాబాద్: ముస్లింలు పవిత్ర రంజాన్ పవిత్ర మాసంగా భావిస్తారు. రంజాన్ సమయంలో హలీం అంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. రంజాన్ సమయంలోనే కాకుండా ఇతర రోజుల్లో కూడ హలీం తినేందుకు చాలా మంది ఆసక్తిని చూపుతారు.రంజాన్ మాసంలో హైద్రాబాద్ నగరంలో హలీం విక్రయించేందుకు పెద్ద ఎత్తున హోటల్స్ ఏర్పాట్లు చేస్తుంటాయి.
also read:ఇక నుండి సెప్టెంబర్ 17న హైద్రాబాద్ విమోచన దినోత్సవం: కేంద్రం నోటిఫికేషన్
అయితే హైద్రాబాద్ నగరంలోని మూసారాంబాగ్ లోని ఓ హోటల్ వద్ద హలీం ను తొలి గంటలో వచ్చినవారికి ఉచితంగా అందిస్తామని నిర్వాహకులు ప్రకటించారు. దీంతో పెద్ద ఎత్తున హలీం తినేందుకు హోటల్ వద్దకు చేరుకోవడంతో ఇబ్బందులు నెలకొన్నాయి. జనాన్ని కంట్రోల్ చేసేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీ చార్జీ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
also read:తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ టీఎస్ నుండి టీజీకి మార్పు: కేంద్రం గెజిట్ నోటిఫికేషన్
also read:గీతాంజలి మృతిపై రాజకీయరంగు: టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ మాటల యుద్ధం, ఎవరి వాదన వారిదే...
మంగళవారం నాడు రాత్రి ఏడు నుండి ఎనిమిది గంటల మధ్య ఉచితంగా హలీమ్ అందిస్తామని హోటల్ నిర్వాహకులు సోషల్ మీడియాలో ప్రకటించారు. ఈ ఆఫర్ తెలుసుకొని వందలాది మంది హోటల్ వద్దకు చేరుకున్నారు.
also read:వెరైటీ పెళ్లి పత్రిక: విత్తనాలను పంచుతున్న ఆదిలాబాద్ వాసి
హోటల్ వద్దకు జనం విపరీతంగా వచ్చారు. దరిమిలా ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. హోటల్ వద్ద జనాన్ని చెదరగొట్టేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీ చార్జీ చేశారు.ఉచిత ఆఫర్ ను ప్రకటించిన హోటల్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు.