ఎంపీ ఎన్నికలకు మరో నలుగురి పేర్లు ఖరారు: జాబితాలో కొత్తముఖాలు

పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే మరో నలుగురు అభ్యర్థుల పేర్లను బీఆర్ఎస్ ప్రకటించింది. 

BRS announces four names for loksabha elections lns

హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే నలుగురు అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ జాబితాలో అనూహ్యంగా  కొత్త వారికి చోటు దక్కింది. తెలంగాణ రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకోవాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్లాన్ చేస్తుంది. 

గత ఏడాది నవంబర్ మాసంలో  జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది.ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో  బీఆర్ఎస్‌ను ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు వీడారు. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్  బీఆర్ఎస్ ను వీడి  కాంగ్రెస్ పార్టీలో చేరారు. జహీరాబాద్ ఎంపీ బీ.బీ. పాటిల్,  నాగర్ కర్నూల్ ఎంపీ పి. రాములు  బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరారు. ఈ పరిణామం బీఆర్ఎస్ కు షాక్ కల్గించింది. దరిమిలా  నష్టనివారణకు చర్యలు చేపట్టింది. నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేపట్టింది.

ఖమ్మం నుండి నామా నాగేశ్వరరావు,  మహబూబాబాద్ నుండి  మాలోతు కవిత, కరీంనగర్ నుండి  బి. వినోద్ కుమార్, పెద్దపల్లి నుండి  కొప్పుల ఈశ్వర్  పేర్లను ఇప్పటికే  బీఆర్ఎస్ ప్రకటించింది.

also read:గీతాంజలి మృతిపై రాజకీయరంగు: టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ మాటల యుద్ధం, ఎవరి వాదన వారిదే...

తాజాగా  మెదక్ నుండి  ఒంటేరు ప్రతాప్ రెడ్డి , జహీరాబాద్ నుండి గాలి అనిల్ కుమార్,  మల్కాజిగిరి నుండి శంభీపూర్ రాజు, చేవేళ్ల నుండి కాసాని జ్ఞానేశ్వర్ పేర్లను బీఆర్ఎస్ నాయకత్వం ఖరారు చేసింది.గతంలో చేవేళ్ల పార్లమెంట్ స్థానం నుండి  సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పేరును ఖరారు చేశారు. అయితే  రంజిత్ రెడ్డి  మరోసారి పోటీ చేయడానికి ఆసక్తి చూపకపోవడంతో  రంజిత్ రెడ్డి స్థానంలో  జ్ఞానేశ్వర్ పేరును  ఆ పార్టీ ఖరారు చేసింది. మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంలో  మాజీ మంత్రి మల్లారెడ్డి తనయుడు  భద్రారెడ్డి పోటీ చేస్తారని తొలుత ప్రచారం సాగింది.అయితే పోటీ నుండి  భద్రారెడ్డి  ఆసక్తి చూపడం లేదని మల్లారెడ్డి  బీఆర్ఎస్ నాయకత్వానికి తేల్చి చెప్పారు. దీంతో  శంభీపూర్ రాజును బీఆర్ఎస్ నాయకత్వం ఖరారు చేసింది.

also read:వెరైటీ పెళ్లి పత్రిక: విత్తనాలను పంచుతున్న ఆదిలాబాద్ వాసి

అసెంబ్లీ ఎన్నికల సమయంలో  గాలి అనిల్ కుమార్  కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరారు. అనిల్ కుమార్ కు  జహీరాబాద్ ఎంపీ స్థానాన్ని కేటాయించారు.జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీ.బీ. పాటిల్  బీజేపీలో చేరడంతో  అనిల్ కుమార్ ను బరిలోకి దింపాల్సి వచ్చింది బీఆర్ఎస్. మిగిలిన స్థానాల్లో కూడ అభ్యర్థులను త్వరలోనే బీఆర్ఎస్ నాయకత్వం ప్రకటించనుంది.

also read:కాంగ్రెస్‌లోకి?: వేంనరేందర్ రెడ్డితో గుత్తా అమిత్ రెడ్డి భేటీ

భారత రాష్ట్ర సమితి  మరో నలుగురు అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటికే నాలుగు పార్లమెంట్ స్థానాల్లో  బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా మరో నలుగురు అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించింది. 

 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios