కాంగ్రెస్‌లోకి?: వేంనరేందర్ రెడ్డితో గుత్తా అమిత్ రెడ్డి భేటీ
తెలంగాణ సీఎం వేం నరేందర్ రెడ్డితో గుత్తా అమిత్ రెడ్డి భేటీ కావడం చర్చకు దారి తీసింది. గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నారని ప్రచారం సాగుతుంది.
హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి మంగళవారంనాడు ముఖ్యమంత్రి సలహాదారు వేంనరేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం సాగుతుంది.
also read:లైవ్‌లోనే సహోద్యోగికి ప్రపోజ్: వైరలైన వీడియో
నల్గొండ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయాలని గుత్తా అమిత్ రెడ్డి భావిస్తున్నారు. నిన్న కేసీఆర్ సమక్షంలో జరిగిన బీఆర్ఎస్ నల్గొండ పార్లమెంటరీ సమీక్ష సమావేశానికి గుత్తా దూరంగా ఉన్నారు. ఇవాళ వేం నరేందర్ రెడ్డితో భేటీ కావడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేస్తారనే చర్చ కూడ ప్రారంభమైంది. ఈ ప్రచారానికి ఊతమిచ్చేలా వేం నరేందర్ రెడ్డితో గుత్తా అమిత్ రెడ్డి భేటీ ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలు దఫాలు గుత్తా సుఖేందర్ రెడ్డి ఎంపీగా ప్రాతినిథ్యం వహించారు.
also read:సీఎం పదవికి మనోహర్ లాట్ ఖట్టర్ రాజీనామా
2014లో కాంగ్రెస్ పార్టీ తరపున గుత్తా సుఖేందర్ రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత పరిణామాల్లో గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ లో చేరిన తర్వాత తెలంగాణ శాసనమండలి చైర్మెన్ పదవిని గుత్తా సుఖేందర్ రెడ్డికి దక్కింది. రెండో దఫా కూడ ఇదే పదవిలో సుఖేందర్ రెడ్డి కొనసాగుతున్నారు.
ఈ దఫా పార్లమెంట్ ఎన్నికల్లో అమిత్ రెడ్డిని బరిలోకి దింపాలని సుఖేందర్ రెడ్డి భావిస్తున్నారు.ఈ మేరకు రంగం సిద్దం చేసుకున్నారు. భువనగిరి పార్లమెంట్ స్థానం నుండి గుత్తా అమిత్ రెడ్డి బరిలోకి దిగే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది.
also read:టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తు: ఎవరి లెక్కలు వారివి....
పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. జహీరాబాద్, నాగర్ కర్నూల్ ఎంపీలు బీబీపాటిల్, పి.రాములులు బీజేపీలో చేరారు.మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుండి బీఆర్ఎస్ తరపున మాజీ మంత్రి మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డి బరిలోకి దిగుతారనే ప్రచారం సాగింది. అయితే ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో మల్లారెడ్డి కుటుంబం కూడ మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుండి పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్న విషయాన్ని బీఆర్ఎస్ నాయకత్వానికి తెలిపిన విషయం తెలిసిందే.