చార్మినార్‌పై అలా అనలేదు, భాగ్యలక్ష్మి టెంపుల్ పై చేయి వేస్తే ఊరుకోం: బండి సంజయ్ ఫైర్
భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకొంటే మీకు నమాజ్ గుర్తుకు వచ్చిందా అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. చార్మినార్ లో నమాజ్ చేసుకొనేందుకు అనుమతివ్వాలని సంతకాల సేకరణపై ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎంలు డ్రామాలు ఆడుతున్నాయని ఆయన మండిపడ్డారు.
హైదరాబాద్:Bhagya Laxmi Temple అమ్మవారిని దర్శించుకొంటే మీకు Namaz గుర్తుకు వచ్చిందా అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు భాగ్యలక్ష్మి ఆలయంపై చేయి వేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు.
గురువారం నాడు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు చార్మినార్ ను తొలగించాలని తాము ఏనాడు ఆనలేదన్నారు. ఓల్డ్ సిటీ న్యూ సిటీగా ఎందుకు కాకూడదని ఆయన ప్రశ్నించారు. చార్మినార్ వద్ద బహిరంగ సభ పెట్టి కూడా పాతబస్తీ అభివృద్ది జరగాలని తాము కోరుకున్నామన్నారు.
రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి MIM కొమ్ముకాస్తుందని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో ఏ రకంగా కుటుంబ పాలన ఉందన్నారు. ఎంఐఎం చీఫ్ Asaduddin Owaisi తన ఆస్తులను పెంచుకోవడానికి, కాపాడుకోవడానికి ముస్లిం మైనార్టీలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్నారని ఆయన విమర్శలు చేశారు. పాతబస్తీని ఎంఐఎం అభివృద్ది చేయడం లేదన్నారు.ఓల్డ్ సిటీ హైటెక్ సిటీగా ఎందుకు మారొద్దు, ఓల్డ్ సిటీలో ఫ్లై ఓవర్లు ఎందుకు రావొద్దని తాము ప్రశ్నించినట్టుగా బండి సంజయ్ గుర్తు చేశారు.
ఓల్డ్ సిటీ సంఘ విద్రోహశక్తులకు, ఉగ్రవాదులకు ఎందుకు అడ్డాగా మారిందో చెప్పాలన్నారు. ముస్లిం మైనార్టీ ఓట్లను పొందాలనే ప్రయత్నంలో భాగంగానే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు.Congress, ఎంఐఎం, TRS లు కలిసి డ్రామాలు ఆడుతున్నాయని ఆయన విమర్శలు చేశారు. భాగ్యలక్ష్మి ఆలయం హిందూవుల ఆరాధ్య దైవంగా ఆయన గుర్తు చేశారు. చార్మినార్ వద్ద గుడి లేదని చెప్పేవాడు మూర్ఖుడన్నారు.
also read:Telangana Formation Day: అమరుల ఆకాంక్షలు నేరవేరేది కాషాయంతోనే: బండి సంజయ్
కాంగ్రెస్ కు దమ్ముంటే భాగ్యలక్స్మి ఆలయంపై చేయి వేయాలని ా ఆయన సవాల్ విసిరారు. అమ్మవారి శక్తిని చూసిన తర్వాత ఇప్పుడు నమాజ్ గుర్తుకు వచ్చిందా అనిఆయన అడిగారు. చార్మినార్ లో నమాజ్ కోసం సంతకాల సేకరణను ముస్లిం సమాజం కూడా హర్షించదన్నారు. చార్మినార్ లో నమాజ్ కోసం అనుమతి ఇవ్వాలని కాంగ్రెస్ నేత రషీద్ ఖాన్ కోరుతున్నారు.ఈ మేరకు ఆయన సంతకాల సేకరణను ప్రారంభించారు. ఈ విషయమై ప్రస్తుతం పార్టీల మధ్య పరస్పరం విమర్శలకు కారణమైంది.