Telangana Formation Day: తెలంగాణ అమర వీరుల ఆకాంక్షలు బీజేపీ ఆధ్వర్యంలోని కాషాయ జెండాతోనే నేరవేరతాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు. కేసీఆర్ కుటుంబ పాలనతో తెలంగాణ చిన్నాభిన్నమైందని విమర్శించారు. అంబేద్కర్ స్పూర్తితో బీజేపీ సాగిస్తున్న పోరుకు మద్దతివ్వాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
Telangana Formation Day: తెలంగాణ అమర వీరుల ఆకాంక్షలు బీజేపీ ఆధ్వర్యంలోని కాషాయ జెండాతోనే నేరవేరతాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు. కేసీఆర్ కుటుంబ పాలనలో రాష్ట్రం ఛిన్నాభిన్నమైందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణ అమర వీరులను స్మరించుకున్నారు. తెలంగాణ కోసం ఉద్యమించిన వారందరికీ అభినందనలు తెలిపారు. తెలంగాణ కోసం ఉద్యమించిన వారందరికీ అభినందనలు తెలిపారు.అంబేద్కర్ స్పూర్తితో ప్రజాస్వామ్య బద్దంగా తెలంగాణ అమరు వీరుల ఆకాంక్ష కోసం బీజేపీ సాగిస్తున్న పోరాటానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కేవలం ఒక్క కుటుంబం వల్లే వచ్చిందనే ధుష్ప్రచారం జరుగుతోందన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీజేపీ చేసిన పోరాటాలను స్మరించుకున్నారు. తెలంగాణలో యువకుల బలిదానాలను ఆపేందుకు బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్ చేసిన కృషి గుర్తు చేసుకున్నారు. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లుకు బీజేపీ మద్దతివ్వకపోతే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించేదే కాదని అన్నారు.
బీజేపీ ఏనాడూ పేరు కోసం పనిచేయలేదని, తెలంగాణ ప్రజల ఆకాంక్ష... అమరవీరుల ఆశయ సాధన కోసమే ఉద్యమించిందని అన్నారు. త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా పాలన సాగుతోందన్నారు. కేవలం ఒక్క కుటుంబం చేతిలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు చిన్నాభిన్నమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు కాషాయ జెండాతోనే సాధ్యమన్నారు. ఈ విషయాన్ని గమనించే ఉద్యమకారులంతా బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. అంబేద్కర్ స్పూర్తితో ప్రజాస్వామ్య బద్దంగా బీజేపీ చేస్తున్న పోరాటానికి ప్రతి ఒక్కరూ మద్దతివ్వాలని కోరారు.
ఈ సందర్బంలో తమిళనాడు రాష్ట్ర వ్యవహారాల సహాయ ఇంఛార్జీ పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ... ప్రగతి భవన్ కేవలం ఒక కుటుంబం ప్రగతికే పరిమితమైందని అన్నారు. చివరకు అంబేద్కర్ రాజ్యాంగాన్ని కూడా పరిహసిస్తూ.. కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్లుండి, చెవులుండి చూడలేని కల్వకుంట్ల ప్రభుత్వ కళ్లు తెరిపించేందుకు... ప్రభుత్వ అరాచకాలను పాతరేసేందుకు బండి సంజయ్ సారథ్యంలో బీజేపీ అలుపెరగని పోరాటాలను యావత్ దేశం చూస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో తమిళనాడు రాష్ట్ర వ్యవహారాల సహాయ ఇంఛార్జీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శ్రుతి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, కోశాధికారి శాంతికుమార్, మహిళా మోరోచా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి, రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి తదితరులు హాజరయ్యారు.
