తెలంగాణ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నేత మోత్కుపల్లి నర్సింహులు.దాదాపు నాలుగు దశాబ్దాల అనుభవం రాజకీయ ల్లో ఆయన సొంతం. 

తెలంగాణ ఉద్యమ ప్రభావం, తెలంగాణా తెలుగుదేశం పార్టీలో నెలకొన్న పరిణామాలు రాజకీయంగా ఆయనకు ఇబ్బంది కలిగించే అంశాలుగా మారాయి. దీంతో  క్రియాశీలక రాజకీయాలకు కొన్ని రోజులుగా దూరంగా ఉన్న ఆయన జాతీయ పార్టీ అయిన బీజేపీలో చేరానున్నారు.

Also read:కారణమిదే:కేబినెట్‌లో భారీ మార్పులకు కేసీఆర్ ప్లాన్?

బిజెపి నేతలతో గత కొన్ని రోజులుగా కలిసిమెలిసి ఉంటున్న  మోత్కుపల్లి నరసింహులు కమలం కండువా కప్పుకో నున్నారు.ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసిన ఆయన అనుభవం రాష్ట్రంలో బిజెపికి కలిసి వస్తుందని  కమలనాథులు భావిస్తున్నారు.

Also read:సీఎంగా కేటీఆర్: ప్లాన్ రెడీ,కేసీఆర్ భవిష్యత్తు ఆచరణ ఇదీ?

 టిఆర్ఎస్ పార్టీపై రాజకీయ విమర్శలు చేసేందుకు మోత్కుపల్లి లాంటి నేత సరైనోడు అన్న అభిప్రాయం బిజెపి నేతల్లో కూడా వ్యక్తమవుతోంది.మోత్కుపల్లి పార్టీలో చేరిన తర్వాత ఆయన స్థాయికి తగ్గ పదవి ఇస్తే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా వ్యవహరించేందుకు అవకాశం దొరుకుతుందని పలువురు బీజేపీ నేతలు అంటున్నారు. 

also read:తెలంగాణ ఎన్నికల సంఘానికి హైకోర్టు షాక్: మున్సిపల్ ఎన్నికలకు బ్రేక్ 

ఆయన పార్టీలో చేరిన తర్వాత ఎలాంటి దక్కే పదవి పై పలువురు బిజెపి నేతలకు స్పష్టత ఉన్నట్లు తెలుస్తుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మోత్కుపల్లి నియమించే అవకాశం ఉందని పార్టీలో ప్రచారం జరుగుతోంది.

Also read:అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన మోత్కుపల్లి: మరికొద్దిసేపట్లో నడ్డాతో భేటీ

మోత్కుపల్లి తో పాటు మరో ఇద్దరికి కూడా బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. సామాజిక సమీకరణల ఆధారంగా బిజెపి జాతీయ నేతలు ఈ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.

కాంగ్రెస్, టిఆర్ఎస్,టీడీపీ  పార్టీలకు రాష్ట్రంలో వర్కింగ్ ప్రెసిడేంట్లు ఉండగా బిజెపి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం.

జాతీయస్థాయిలో వర్కింగ్ ప్రెసిడెంట్ ను నియమించడంతో  పార్టీ అవసరాలకు అనుగుణంగా  రాష్ట్రాలలో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం జరిగే అవకాశం ఉంటుంది.