సీఎంగా కేటీఆర్: ప్లాన్ రెడీ,కేసీఆర్ భవిష్యత్తు ఆచరణ ఇదీ?
కేటీఆర్ కు ముఖ్యమంత్రి పదవిని ఇస్తే కేసీఆర్ జాతీయ రాజకీయాలపై కేంద్రీకరిస్తారని అంటున్నారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు వీలుగా రాజ్యసభకు కసీఆర్ వెళ్తారని అంటున్నారు.
హైదరాబాద్: తెలంగాణలో నూతన ముఖ్యమంత్రిగా యువనేత కేటీఆర్ పదవీ బాధ్యతలు చేపడితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేస్తారన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో మొదలైంది.
also read:తెలంగాణ ఎన్నికల సంఘానికి హైకోర్టు షాక్: మున్సిపల్ ఎన్నికలకు బ్రేక్
ఆరేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన కేసీఆర్ గత ఎన్నికలకు ముందు జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ తెరపైకి తెచ్చి ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే యత్నం చేశారు. అయితే ఇది పెద్దగా ఫలితం ఇవ్వలేదు.
also read: తెరపైకి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్: కేటీఆర్‌కు సీఎం పదవి?
కేంద్రంలో సంపూర్ణ మెజారిటీ తో బిజెపి అధికార పగ్గాలు చేపట్టడంతో ఫ్రంట్ అటకెక్కింది. తాజాగా రాష్ట్రంలో యువనేతకు రాష్ట్ర ప్రభుత్వ పగ్గాలు కట్ట పెడతారన్న ప్రచారం ప్రచారంతో కెసిఆర్ రాజ్యసభకు వెళ్తారనే ప్రచారం మొదలైంది.
Also read: వీక్లీ రౌండప్: మంత్రుల మెడకు మున్సిపల్ ఉచ్చు, కేటీఆర్‌కు సీఎం పదవి?
రాబోయే ఏప్రిల్ నెలలో రెండు రాజ్యసభ స్థానాలు తెలంగాణలో ఖాళీ కానున్నాయి. ఆ రెండు కూడా అధికార పార్టీ అభ్యర్థులకే దక్కనున్నాయి. ముఖ్యమంత్రిగా కేటీఆర్ కు మార్చి నెలలోపే పట్టం కడతారని ప్రచారం ఉన్న నేపధ్యంలో ఆ వెంటనే వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో కెసిఆర్ రాజ్యసభ కు వెళ్లే అవకాశాలు ఉంటాయని అధికార పార్టీ నేతలు అంటున్నారు.
Also read:వీక్లీ రౌండప్:దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం, కరీంనగర్ కలెక్టర్ బదిలీ
ఈ విడత ఢిల్లీ కేంద్రంగా ఉంటూ ఫెడరల్ ఫ్రంట్ ముందుకు తీసుకెళ్తే జాతీయ నాయకుడిగా కేసిఆర్ కు ప్రత్యేకంగా గుర్తింపు దక్కే అవకాశం ఉంటుందని నేతలు అంటున్నారు.
Also read:రాజధాని రాజకీయం: అమరావతి భవితపై ఆందోళన, ముంచుతారా తేల్చుతారా?
గతంలో హైదరాబాద్ కేంద్రంగా నే ఫెడరల్ ఫ్రంట్ రాజకీయాలు చేసిన కెసిఆర్ ఈ విడత మాత్రం ఢిల్లీకి మారి అక్కడి నుంచే చక్రం తిప్పుతారని టిఆర్ఎస్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కేటీఆర్ ముఖ్యమంత్రి గా పదవీ బాధ్యతలు చేపడితేనే కెసిఆర్ ప్రత్యామ్నాయ రాజకీయాలను నడిపించే అవకాశం ఉంటుందని గులాబీ నేతలు అంటున్నారు.