హైదరాబాద్: మున్సిపల్ ఎ్ననికలపై కేసీఆర్ సర్కార్‌కు తెలంగాణ హైకోర్టు సోమవారం నాడు షాకిచ్చింది. ఈ నెల 7వ తేదీవరకు నోటీఫికేషన్ ఇవ్వొద్దని హైకోర్టు ఆదేశించింది.మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారంగా ఈ నెల 7వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది.

మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారంగా ఈ నెల 7వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది.  ఈ నెల 7వ తేదీ సాయంత్రం వరకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయకూడదని హైకోర్టు తెలంగాణ ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

గత ఏడాది డిసెంబర్ 23వ తేదీన  తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. రిజర్వేషన్లను ఖరారు చేయకుండానే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంపై కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర విపక్షాలన్నీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.

Also read:వీక్లీ రౌండప్:దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం, కరీంనగర్ కలెక్టర్‌ బదిలీ

ఈ విషయమై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం నాడు మధ్యాహ్నం రెండున్నర గంటలకు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రకాష్ రెడ్డి వాదించారు.  రాష్ట్ర ప్రభుత్వం తరపున మోహన్ రెడ్డి వాదనలను విన్పించారు.

Also read: తెరపైకి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్: కేటీఆర్‌కు సీఎం పదవి?

ఎన్నికల  నిబంధనల మేరకు రిజర్వేషన్లకు ఎన్నికలకు మధ్య కనీసం వారం రోజుల గడువు ఉండాల్సిన అవసరాన్ని కాంగ్రెస్ పార్టీ తరపు న్యాయవాది ప్రకాష్ రెడ్డి హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.  

తెలంగాణలో పుర పోరు: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల, జనవరి 22న పోలింగ్

రిజర్వేషన్లు ప్రకటించకుండానే షెడ్యూల్ ప్రకటించారని ప్రకాష్ రెడ్డి హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాదు రిజర్వేషన్లు ప్రకటించిన మరునాడే నోటిఫికేషన్ విడుదల చేయడం విపక్షాలకు నష్టం చేసేదిగా ఉందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.

Also read: వీక్లీ రౌండప్: మంత్రుల మెడకు మున్సిపల్ ఉచ్చు, కేటీఆర్‌కు సీఎం పదవి?

ఇదే విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఈ వాదనలను విన్న హైకోర్టు ఎన్నికల నిబంధనలను తమ ముందు ఉంచాలని హైకోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అంతేకాదు ఈ నెల 7వ తేదీ సాయంత్రం వరకు ఎన్నికల నోటీఫికేషన్ విడుదల చేయకూడదని రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Also read:రాజధాని రాజకీయం: అమరావతి భవితపై ఆందోళన, ముంచుతారా తేల్చుతారా?