Asianet News TeluguAsianet News Telugu

మెట్రో స్టేషన్‌లోనూ ‘బిగ్‌బాస్ చూస్తున్నాడు’.. నాగార్జున చేతుల మీదుగా అవగాన ప్రచారం ప్రారంభం

బిగ్‌బాస్ ఇకపై హైదరాబాద్ మెట్రో స్టేషన్‌లలోనూ నజర్ పెట్టనున్నారు. స్టార్ మా, ఎల్‌టీమెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ సంయుక్తంగా ప్రజా భద్రత అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించాయి. నగరంలోని 57 మెట్రో స్టేషన్‌లలో ఈ ప్రజా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కొవిడ్ జాగ్రత్తలు, మెట్రోలో పాటించాల్సిన నిబంధనలు, స్మార్ట్ ట్రావెలింగ్ వంటి అనేక కీలక విషయాలపై ప్రయాణికులకు అవగాహన కల్పించనున్నారు.
 

bigboss security awareness programme launched by nagarjuna
Author
Hyderabad, First Published Nov 13, 2021, 6:35 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

హైదరాబాద్: Star Maaలో ప్రసారమయ్యే రియాలిటీ Bigg Bossకు విశేష ఆదరణ ఉన్నది. కంటెస్టెంట్లను బిగ్‌బాస్ ఎప్పుడూ పర్యవేక్షిస్తుంటాడు కదా.. అదే తరహాలో ఇకపై Hyderabad మెట్రో స్టేషన్‌లోలనూ బిగ్‌బాస్ ఓ కన్నేయనున్నాడు. అంటే.. బిగ్‌బాస్ ఈజ్ వాచింగ్ యూ(బిగ్‌బాస్ మిమ్మల్ని చూస్తున్నాడు) అనే పేరుతో స్టార్ మా, ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ సంయుక్తంగా భద్రతా అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. ఈ భద్రతా అవగాహన ప్రచారం బిగ్‌బాస్ 5 హోస్ట్ నాగార్జున చేతుల మీదుగా ప్రారంభమైంది.

నగరంలోని 57 Metro Stationలలో కాన్‌కోర్స్, ఎంట్రీ-ఎగ్జిట్, చెక్ ఇన్ ప్రాంగణాలలో ఈ ప్రజా అవగాహన(Awareness) కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన జింగిల్స్‌ను ఉపయోగిస్తున్నారు. అదే తరహా సందేశాలను మెట్రో రైళ్లలోనూ ప్రచారం చేస్తున్నారు. ఈ క్యాంపెయిన్‌ను మొత్తం బిగ్‌బాస్ సీజన్ 100 రోజులూ చేపట్టనున్నారు. మెట్రో ప్రయాణికులు జర్నీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెట్రో స్టేషన్ ప్రాంగణంలో పాటించాల్సిన విధనాల గురించి ఈ కార్యక్రమంలో అవగాహన ఇవ్వనున్నారు. భద్రతా ప్రమాణాలు, మెట్రో నిబంధనలు, తమ సౌకర్యం కోసం సరైన విధానంలో అవకాశాలను వినియోగించే కీలక అంశాలపై అవేర్‌నెస్ తీసుకువస్తారు.

Also Read: ఏళ్ళేహే.. మోఖం పగిలిపోతడి అంటూ లోబోకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సిరి..

ఈ కార్యక్రమంలో బిగ్‌బాస్ హోస్ట్ అక్కినేని నాగార్జున మాట్లాడుతూ, వినోదానికీ హేతుబద్ధమైన ఒక విధానముండాలని, ఈ ప్రచారం దానికి చక్కగా సరిపోతుందని వివరించారు. బిగ్‌బాస్ అనేది పూర్తిగా వినోదాత్మక కార్యక్రమమని, ఈ కార్యక్రమంతో మెట్రో ప్రయాణికుల్లో భద్రతాపరమైన అవగాహనను మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఇది ప్రయాణిలకు ఎన్నో విషయాలను తెలియజేస్తందన్నారు. స్టార్ మా, ఎల్‌టీఎంఆర్‌హెచ్ఎల్ ఈ విధంగా సృజనాత్మకంగా, సామాజికంగా బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకోవడం సంతోషకరమని అన్నారు.

ఎల్‌టీఎంఆర్‌హెచ్ఎల్ ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డి మాట్లాడుతూ, బిగ్‌బాస్ సీజన్ 3 సమయంలోనే 2019లో తాము స్టార్ మాతో కలిసి విజయవంతంగా కార్యక్రమం చేపట్టామని, ఇప్పుడు మరోసారి అదే ఉత్సాహంతో హైదరాబాద్ మెట్రో స్టేషన్‌లలో అవగాహన కార్యక్రమం చేపడుతున్నామని వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా మెట్రో స్టేషన్‌ల వద్ద బిగ్‌బాస్ ఈజ్ వాచింగ్ ప్రచారాన్ని ప్రారంభించామని తెలిపారు. దీని ద్వారా కొవిడ్ భద్రత, సురక్షిత ప్రయాణ పద్ధతులు వంటి కీలక విషయాలపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. మొబైల్ క్యూఆర్ టికెట్లు, స్మార్ట్ కార్డులు సురక్షితంగా ఉపయోగించుకుని స్మార్ట్ ట్రావెల్ అలవాట్లు పెంచడానికి ప్రయత్నిస్తున్నామని వివరించారు.

Also Read: Bigg Boss Telugu 5: కంట్రోల్‌ తప్పిన వ్యక్తిగత దూషణలు.. తారాస్థాయికి షణ్ముఖ్‌-సన్నీ-సిరిల మధ్య గొడవ

అర్థవంతమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ లక్షలాది మంది జీవితాలను ఫలప్రదం చేయాలనేదాన్ని ఓ నెట్‌వర్క్‌గా డిస్నీ, స్టార్ ఇండియాలు ఎప్పుడూ తలుస్తాయని స్టార్ మా అధికార ప్రతినిధి అన్నారు. తమ సందేశాల ద్వారా అవసరమైన సమాచారాన్ని ప్రజలకు చేరువచేస్తామని, హైదరాబాద్ మెట్రో రైల్‌తో ఒప్పందం కుదరడం సంతోషంగా ఉన్నదని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా తమ అతిపెద్ద ప్రాపర్టీ షోలలో బిగ్‌బాస్ ఒకటి అని, అత్యధికుల ఆదరణ చూరగొన్న బిగ్‌బాస్ మార్గాన్ని ఎంచుకోవడం ద్వారా భద్రతా అవగాహనను ప్రజల్లో సులువుగా కల్పించగలమని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios