Asianet News TeluguAsianet News Telugu

Bigg Boss Telugu 5: కంట్రోల్‌ తప్పిన వ్యక్తిగత దూషణలు.. తారాస్థాయికి షణ్ముఖ్‌-సన్నీ-సిరిల మధ్య గొడవ

బిగ్‌బాస్‌ తెలుగు 5లో శుక్రవారం ఎపిసోడ్‌ పీక్‌లోకి వెళ్లింది. ఓ వైపు సన్నీ, షణ్ముఖ్‌, సిరిల మధ్య వాగ్వాదం, మరోవైపు అనీ మాస్టర్, కాజల్‌ ల వాగ్వాదం తారాస్థాయికి చేరింది. ఆడియెన్స్ కి వినోదాన్ని పంచింది. 

sunny shanmukh and siri fire between them at biggboss telugu 5
Author
Hyderabad, First Published Nov 12, 2021, 11:51 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

బిగ్‌బాస్‌ తెలుగు 5(Bigg Boss Telugu5 ).. శుక్రవారం ఎపిసోడ్‌  గెస్ట్ టీమ్ వాళ్ల నుంచి బీబీ హోటెల్‌ టీమ్‌ వాళ్లు ఎంత డబ్బు సంపాదించుకున్నారో డిస్కషన్‌ చేసుకున్నారు. తమకి డబ్బులు ఇవ్వడం లేదని కామెడీలు చేసుకున్నారు. అయితే ఈ సందర్భంగా సన్నీని అనీ మాస్టర్‌ ఏకంగా ఎత్తుకుని తిరగడం విశేషం. దీంతో ఆమె వంద రూపాయలు ఇచ్చాడు.. మరోవైపు కాజల్‌కి రవి, షణ్ముఖ్‌ కథలు చెప్పారు. ఇందులో రవి చెప్పిన కథకి ఇంప్రెస్‌ అయిన కాజల్‌ ఆయనకు వంద రూపాయలు ఇచ్చింది. అనంతరం బిగ్‌బాస్‌ నుంచి అనౌన్స్ మెంట్ వచ్చింది. ఈ టాస్క్ లో అతిథుల నుంచి 15వేలు రాబట్టుకోవాల్సి ఉండగా, బిగ్‌బాస్‌ హోటల్‌ టీమ్‌ కేవలం 9500 మాత్రమే సాధించారు. దీంతో హోటల్‌ టీమ్‌ ఈ టాస్క్ లో ఓడిపోయారు. కెప్టెన్సీ టాస్క్ కి అర్హత కోల్పోయారు. 

మరోవైపు ఈ టాస్క్ లో బిగ్‌బాస్‌.. రవికి సీక్రెట్‌ టాస్క్ ఇచ్చాడు. ఇంట్లో అన్నింటి చెడగొడుతూ ఉండాల్సి ఉంటుంది. దీంతో రవి విజయం సాధించింది. కెప్టెన్సీ టాస్క్ లో అర్హత సాధించారు. మరోవైపు అర్హత కోల్పోయిన బీబీ హోటెల్‌ వాళ్లకు ఓ ఛాన్స్ ఇచ్చాడు బిగ్‌బాస్‌. అతిథుల్లో ఏ ఇద్దరికి కెప్టెన్సీ టాస్క్ లో పాల్గొనే అర్హత లేదో తెలియజేయాలని చెప్పారు. అందరు కలిసి ప్రియాంక, మానస్‌లకు అర్హత లేదని నిర్ణయించారు. దీంతో ప్రియాంక ఫైర్‌ అయ్యింది. రెడీ అవ్వడానికే ఎక్కువ టైమ్‌ తీసుకుంటుందని వాదించడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో హౌజ్‌ కాస్త హీటెక్కింది. ప్రియాంక, మానస్‌లు మినహాయిస్తే సన్నీ, సిరి, కాజల్‌, రవి కెప్టెన్సీ టాస్క్ లో పోటీ పడతారు. 

`టవర్‌లో పవర్‌ ఉంది` అనే టాస్క్ లో కెప్టెన్సీ పోటీదారులు పాల్గొనాల్సి ఉంది. ఇందులో భాగంగా పోటీదారులు టవర్‌ నిర్మించాల్సి ఉంటుంది. దాన్ని శత్రువుల దాడి నుంచి కింద పడకుండా కాపాడుకోవాలి. మొదటి రౌండ్‌లో కాజల్‌ వి ఎక్కువగా పడిపోవడంతో ఆమె ఎలిమినేట్‌ అయ్యింది. రెండో రౌండ్‌లో సన్నీవి పడిపోతాయి. మూడో రౌండ్‌లో సిరివి పడిపోవడంతో రవి కెప్టెన్‌గా గెలిచారు. అయితే ఈ టాస్క్ మాత్రం హౌజ్‌ని బాగా హీటెక్కించింది. సిరి, సన్నీ మధ్య చోటుకున్న వాగ్వివాదం సీరియస్‌ మోడ్‌లోకి వెళ్లిపోయింది. తన టవర్‌ని పడేసేందుకు సిరి ప్రయత్నించిందనేకారణంతో ఆమెపై ఫైర్‌ అయ్యాడు సన్నీ. దీనికి ఆమె కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయ్యింది. 

తాను కూడా టవర్‌ని తంతాను అని అన్నాడుసన్నీ. ఎవరిని తంతావ్‌ అంటూ మీది మీదికి వచ్చింది సిరి. దీంతో నేను గేమ్‌ ఆడితే అప్పడంలా తొక్కేస్తా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు సన్నీ.దీనికి షణ్ముఖ్‌ రియాక్ట్ అయ్యాడు. ఎవరిని అప్పడం చేస్తావ్‌. చేయిరా అప్పడం అంటూ సన్నీపై ఫైర్‌ అయ్యాడు. దీనితో షన్ను, సన్నీ మధ్య పెద్ద వివాదం తెలెత్తింది. ఏరా పోరా అనే స్థాయి దాటి, కొట్టుకుందామా... కొడతావా అనే రేంజ్ కి వెళ్ళింది . ఇద్దరూ రెచ్చిపోయారు. ఆడవాళ్లని అడ్డు పెట్టుకుని గేమ్‌ ఆడుతున్నావన్నాడు సన్నీ. దీనికి సిరి రియాక్ట్ అవుతూ సన్నీపై తనదైన స్టయిల్‌లో ఎగబడింది. ఓ వైపు షణ్ముఖ్‌, మరోవైపు సిరి కలిసి సన్నీని ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. సన్నీ సైతం రెచ్చిపోయాడు. 

అయితే మానస్, కాజల్‌, అనీ మాస్టర్లు కలుగ చేసుకుని ఇద్దరిని ఆపే ప్రయత్నం చేశారు. అయితే గిలిగింతలు పెట్టిందని అనీ మాస్టర్‌ కూడా కాజల్‌పై మండి పడింది. దానికి కాజల్‌ మళ్లీ అలా చేయను అని ముందే చెప్పినా వినకుండా సంచాలక్‌గా ఉన్న అనీ మాస్టర్‌ కాజల్‌పై విమర్శలు చేశారు. నాగిని అంటూ నాట్యం చేసి చూపించింది. మరోవైపు ఎక్కిరించినట్టుగా రకరకాలుగా హేళన చేసింది అనీ మాస్టర్. మరోవైపు ఫాల్త్ గేమ్‌ ఆడుతున్నావంటూ పెద్ద మాట మాట్లాడింది. దీంతో కాజల్‌ కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యింది. ఇది అనీ మాస్టర్‌, కాజల్‌ మధ్య వివాదంగా మారింది. కాసేపు సన్నీ,షణ్ముఖ్,సిరిల మధ్య, మరికాసేపు అనీ మాస్టర్‌, కాజల్‌ ల మధ్య గొడవ హౌజ్‌లో పీక్‌లోకి వెళ్లింది. షోని మరింత రక్తికట్టించింది. అయితే సభ్యులు వ్యక్తిగత దూషణలకు పోవడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. 

ఈ క్రమంలోనే చివరి వరకు తన టవర్‌ని నిలుపుకున్న రవి ఈ వారం కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇక ఈ రోజు గేమ్‌లో జెస్సీ ప్రస్తావనే లేకపోవడం గమనార్హం. అయితే నిన్నటి ఎపిసోడ్‌లో తనకు తల తిరుగుతుందని, షివరింగ్‌ వస్తుందని జెస్సీ చెప్పాడు. దీంతో ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు అసలు గేమ్‌ స్టార్ట్ కాబోతుంది. శనివారం నాగ్‌ ఎంట్రీ ఇస్తాడు. ఈ రోజు జరిగిన ఘటనపై సభ్యులకు రేపు నాగ్‌ గట్టిగానే ఇవ్వబోతున్నాడని చెప్పొచ్చు. మరోవైపు పదో వారంలో సన్నీ, రవి, కాజల్‌, సిరి, మానస్‌ నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్‌ అవతారనేది సస్పెన్స్ నెలకొంది. 

ఈ రోజు జరిగిన ఘటనలకు సంబంధించి మార్నింగ్‌ ప్రోమో రిలీజ్‌ అయ్యింది. ఇందులో సన్నీ, షణ్ముఖ్‌ల మధ్య వివాదాన్ని హైలైట్‌గా చూపించడంతో షణ్ముఖ్‌ అభిమానులు ఆయన్ని ట్విట్టర్‌లో ట్రెండింగ్‌ చేశారు. దీంతో చాలా సేపు ఆయన ట్రెండింగ్‌ అవడం విశేషం. 

also read: Samantha Post: ట్రెండ్‌ అవుతోన్న సమంత పోస్ట్.. అర్థాలు వెతుక్కుంటున్న నెటిజన్లు.. చెడు తర్వాత మంచేనా?

Follow Us:
Download App:
  • android
  • ios