ప్రముఖ మీడియా సంస్థ టీవీ9 కొత్త సీఈవోగా జీ మీడియా మాజీ సీఈవో బరుణ్ దాస్ నియమితులయ్యారు. నిన్న మొన్నటి వరకు తాత్కాలిక సీఈవోగా ఉన్న మహేంద్ర మిశ్రా టీవీ9 గ్రూప్ సలహాదారుగా కొనసాగనున్నారు.
ప్రముఖ మీడియా సంస్థ టీవీ9 కొత్త సీఈవోగా జీ మీడియా మాజీ సీఈవో బరుణ్ దాస్ నియమితులయ్యారు. నిన్న మొన్నటి వరకు తాత్కాలిక సీఈవోగా ఉన్న మహేంద్ర మిశ్రా టీవీ9 గ్రూప్ సలహాదారుగా కొనసాగనున్నారు.
బరుణ్ దాస్ ఐఐటీ మద్రాస్, ఐఐఎం కోల్‌కతా, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు. బరుణ్ నియామకాన్ని బోర్డ్ డైరెక్టర్ సింగారావు ధృువీకరించారు. ఉత్తర, దక్షిణ భారతదేశాల్లో టీవీ9ను బరుణ్ అత్యున్నత స్థానంలో నిలుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
బరుణ్ దాస్ మాట్లాడుతూ.. తాను ఎప్పుడెప్పుడు బాధ్యతలు స్వీకరిస్తానా అని ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. జీవితంలో ప్రతి కొత్త అవకాశం.. కొత్త ఛాలెంజ్‌ను విసురుతుందని... తన శక్తిమేరకు టీవీ9ని జాతీయ స్థాయిలో దూసుకెళ్లేలా చేస్తానని బరుణ్ స్పష్టం చేశారు.
టీవీ9 గ్రూపులో పనిచేయడం తనకు దక్కిన గౌరవంగా ఆయన తెలిపారు. 2004లో ప్రారంభమైన టీవీ9.. తెలుగు, కన్నడ, మరాఠీ, గుజరాతీ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రముఖ వార్తా సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది.
రవిప్రకాష్ ఔట్: టీవీ9 సీఈఓగా మహేంద్ర మిశ్రా
టీవీ9 వివాదం: రవి ప్రకాష్ స్థానంలో కొత్త సీఈఓను ప్రకటించే ఛాన్స్
టీవీ9 వివాదం: పోలీసుల విచారణకు హాజరైన ఫైనాన్స్ డైరెక్టర్
రెండో రోజూ టీవీ9 కార్యాలయంలో పోలీసుల సోదాలు
ఉత్కంఠ: రవి ప్రకాష్ రేపు పోలీసుల ముందుకు వస్తారా?
రవిప్రకాష్ భార్యకు నోటీసులు అందజేసిన పోలీసులు
రవిప్రకాష్ కోసం రెండు రోజులుగా గాలింపు: పాస్‌పోర్ట్ స్వాధీనం
టీవీ9 వివాదం: రవిప్రకాష్‌తో హీరో శివాజీ లింక్ ఇదే
టీవీ9 చేతులు మారిందిలా : రవి ప్రకాష్‌పై ఆరోపణలివే
