మెగా సోదరుడు నాగబాబుకి బాలయ్య అభిమానుల నుంచి నిరసన సెగ తగిలింది. గత కొంతకాలంగా.. సోషల్ మీడియా వేదికగా.. బాలయ్య,, నాగబాబుల మధ్య ఇగో వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే.  పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియదని బాలకృష్ణ.. బాలయ్య ఎవరో తనకు తెలీదని నాగబాబు  చేసిన కామెంట్స్.. హాట్ టాపిక్ గా మారాయి.

అక్కడితో ఆగకుండా నాగబాబు.. బాలకృష్ణ మీద తరచూ సోషల్ మీడియాలో ఇండైరెక్ట్ గా ఏదో ఒక సెటైర్ వేస్తూనే ఉన్నారు. ఆయన సెటైర్లకు నందమూరి అభిమానులు కూడా అదే రీతిలో సమాధానం చెబుతున్నారు.

కాగా.. తాజాగా చెన్నైలో నాగబాబుపై బాలయ్య అభిమానులన నిరసన వ్యక్తం చేశారు. నాగబాబు చెన్నైలోని ఓ కాలేజీ లో జరుగుతున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే.. ఆ కార్యక్రమంలో నాగబాబు మైక్ అందుకొని మాట్లాడటం మొదలుపెట్టగానే.. కొందరు విద్యార్థులు..‘‘బాలయ్య..బాలయ్య’’ అంటూ నినాదాలు చేశారు. వారి నినాదాలకు నాగబాబు అసహనం వ్యక్తం చేశారు. 

read more news

ఎన్టీఆర్ బయోపిక్: బాలయ్యపై నాగబాబు సెటైరికల్ కవిత!

బాలయ్యకి నాగబాబు కౌంటర్..సోషల్ మీడియాలో వైరల్

బాలకృష్ణ మంచి కమెడియన్: నాగబాబు వ్యాఖ్య!

బాలయ్య, నాగబాబు ఎపిసోడ్.. టాలీవుడ్ ఇన్సైడ్ టాక్ ఏంటంటే..?