జై శ్రీరాం అని నినాదాలు చేయనందుకు ఓ ఉబర్ కార్ డ్రైవర్ ను పలువురు వ్యక్తులు వెంబడించి మరీ కొట్టారు. ఈ ఘటన హైదరాబాద్ లోని అల్కాపురి సమీపంలో చోటు చేసుకుంది.
‘డెక్కెన్ క్రానికల్ ’ నివేదించిన వివరాల ప్రకారం. సయ్యద్ లతీఫుద్దీన్ అనే వ్యక్తి ఉబర్ కార్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అల్కాపురిలో రైడ్ రావడంతో అక్కడి వెళ్తున్నాడు. అయితే టోలిచౌకి సమీపంలోకి చేరుకునే సరికి 3.45 గంటల ప్రాంతంలో రెండు బైక్‌లు కారుపక్కన వచ్చి ఆగాయి. వాటిపై నుంచి నలుగురు వ్యక్తులు దిగి మొదట కారును చేతులతో కొట్టారు. ఏమైందని డ్రైవర్ వారిని అడిగాడు. అతడి యాసను గమనించిన వ్యక్తులు జై శ్రీరాం అని నినాదాలు చేయాలని అన్నారు. అతడు దానికి ఒప్పుకోలేదు.
రామాంతాపూర్ నారాయణ కాలేజీ ఘటన :ఏవో అశోక్ రెడ్డి మృతి, విద్యార్థి పరిస్థితి విషమం..
నిందితులు కారు డోరు తీసేందుకు ప్రయత్నించారు. కానీ వారి నుంచి బాధితుడు తప్పించుకొని అల్కాపురి సమీపంలోని ఏకాంత ప్రదేశానికి చేరుకున్నాడు. దాదాపు మూడు కిలో మీటర్లు ఆ బైక్ లపై వారు కూడా అతడిని వెంబడించారు. కానీ ఓ చోట డెడ్ ఎండ్ ఉండటంతో లతీఫుద్దీన్ ఆగిపోయాడు. వెంటనే అతడు ఫోన్ ద్వారా, బయట గట్టిగా అరుస్తూ సాయం కావాలని కోరడం ప్రారంభించాడు. అయినా ఎవరూ లేకపోవడం, నిందితులు దగ్గరికి వస్తుండటంతో బయపడిపోయిన డ్రైవర్ సమీపంలోని పొదల్లో దాక్కున్నాడు. దీంతో చుట్టుపక్కల ఉన్న భారీ రాళ్లను ఎత్తుకెళ్లి సైడ్ విండోలను పగలగొట్టారు.
భర్తను చెప్పుతో కొట్టిన భార్య.. మరో మహిళతో వివాహేతరసంబంధం..రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని దేహశుద్ధి...
ఇదే సమయంలో స్థానికులు అటుగా రావడంతో కారు పేపర్లను, నగదును తీసుకెళ్లిపోయారు. అనంతరం బాధితుడు పోలీసులకు సమాచారం అందించాడు. ఈ ఘటనపై నార్సింగి స్టేషన్ హౌస్ ఆఫీసర్ వి. శివ కుమార్ మాట్లాడుతూ.. “మేము కేసును దర్యాప్తు చేసేందుకు మార్గంలోని అన్ని సీసీటీవీ కెమెరాలను తనిఖీ చేసేందుకు మా బృందాలను పంపించాం. బాధ్యులను సోమవారం వరకు నిందితులను కస్టడీలోకి తీసుకుంటాం ’’ అని ఆయన అన్నారు.
ఇల్లందులో దొంగల బీభత్సం.. సింగరేణి సెక్యూరిటీ ఆఫీసర్‌పై రాళ్ల దాడి..
కాగా.. తనపై జరిగిన ఘటనను డయల్ 100 ద్వారా పోలీసులకు వివరిస్తే వారు అక్కడికి చేరుకోవడానికి గంట సమయం పట్టిందని ఉబర్ క్యాబ్ డ్రైవర్ సయ్యద్ లతీఫుద్దీన్ ఆరోపించారు. అయితే ఈ ప్రాంతంలో నెట్‌వర్క్ కవరేజీ తక్కువగా ఉందని, పోలీసులు లొకేషన్‌ను నిర్ధారించడానికి సమయం తీసుకున్నారని, అయితే 12 నిమిషాల్లో ఆ ప్రదేశానికి చేరుకున్నారని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఇదిలా ఉండగా. కాగా.. గత నెల 8వ తేదీన కూడా రాజేంద్రనగర్‌లో ఓలా డ్రైవర్, ఓనర్ పై ఓ గ్యాంగ్ దాడి చేసింది.
