Asianet News TeluguAsianet News Telugu

భర్తను చెప్పుతో కొట్టిన భార్య.. మరో మహిళతో వివాహేతరసంబంధం..రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని దేహశుద్ధి...

వరంగల్ లో ఓ భర్త తనతో పనిచేసే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని భార్యను వేదించడం మొదలుపెట్టాడు. దీంతో అనుమానం వచ్చిన భార్య అతడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. 

Extra-marital affair with another woman, husband caught red-handed and beaten in warangal
Author
First Published Sep 5, 2022, 9:54 AM IST

వరంగల్ : ఓకే శాఖలో పనిచేస్తున్న ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల వివాహేతర సంబంధం వరంగల్ లో వెలుగులోకి వచ్చింది. వారిద్దరూ భార్య, బంధువులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికి పోవడంతో.. భర్తకు దేహశుద్ధి చేసిన సంఘటన వరంగల్ మండలం పైడిపల్లిలోని ఆర్టీసీ కాలనీలో ఆదివారం చోటు చేసుకుంది. హసన్పర్తి ఎస్ఐ విజయ్ కుమార్, స్థానికులు తెలిపిన కథనం ప్రకారం… హనుమకొండలోని కుమార్ పల్లి ప్రాంతానికి చెందిన జీవన్ అనే వ్యక్తి వరంగల్ కార్పొరేషన్లో సూపర్డెంట్ గా పనిచేసి నాలుగేళ్ల క్రితం సస్పెన్షన్ కు గురయ్యాడు. అదే సంస్థలో పనిచేస్తున్న ఓ వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.

అతడికి 2018లో వివాహమయ్యింది. ప్రస్తుతం జీవన్ భార్యతో కలిసి హనుమకొండలో నివాసముంటున్నాడు. వివాహం జరిగినప్పటి నుంచి భార్యతో తరచూ గొడవపడి అసభ్యకరమైన మాటలతో తీవ్రంగా వేధించేవాడు. పుట్టింటి నుంచి సగం ఆస్తి తీసుకురావాలని, లేకపోతే విడాకులు తీసుకోవాలని హింసించేవాడు. భర్త ప్రవర్తనపై అనుమానం వచ్చిన భార్య వివాహేతర సంబంధం గురించి తెలుసుకుంది. ఎలాగైనా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. 

వివాహేతర సంబంధం : నగరిలో దారుణం.. ప్రియుడిపై మోజుతో భర్తను హతమార్చిన భార్య

ఆదివారం ఉదయం పైడిపల్లి ఆర్టీసీ కాలనీలో ఉన్న మహిళ ఇంటికి జీవన్ వెళ్లాడు. అతని వెనకాలే వెళ్లిన భార్య.. వారు గదిలో ఉండగా తలుపు బయట గడియ పెట్టింది. బంధువులు, పోలీసులకు సమాచారం అందించింది. అక్కడికి చేరుకున్న బంధువులు.. ఇంట్లోకి వెళ్లి జీవన్ కు దేహశుద్ధి చేశారు. భార్య అతడిని చెప్పుతో కొట్టింది. హసన్పర్తి పోలీసులు జీవన్ ను పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు.  బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో సెప్టెంబర్ 1న వెలుగులోకి వచ్చింది. ఓ భర్త అనుమానంతో భార్యని తెగనరికాడు. దీంతో అప్పటి వరకు భార్యా పిల్లలతో కళకళలాడుతున్న ఇల్లు స్మశానంలా మారిపోయింది. ఆవేశంతో భార్యను హతమార్చిన భర్త జైలు పాలయ్యాడు.. ఏం జరుగుతుందో తెలియని ముగ్గురు పిల్లలు అనాథలుగా మారారు. ఆ పసివారి ఏడుపులు ప్రతి ఒక్కరినీ కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ సీఐ జగదీశ్వరరావు తెలిపిన కథనం మేరకు…

మహబూబ్ నగర్ జిల్లాలోని మహమ్మదాబాద్ మండలానికి చెందిన ఆముదాల గడ్డ తండా నివాసి లలిత (28), మౌలాలిలోని హనుమాన్ నగర్ లో ఉండే శంకర్తో పదేళ్ల కిందట ఆమెకు వివాహమైంది. వీరికి ఏడేళ్ల కుమార్తె, ఐదేళ్లు, మూడేళ్ల కుమారులు సంతానం. అద్దె ఇంట్లో ఉంటూ జీవనం సాగించేవారు. ఈ క్రమంలో భార్య లలిత తరచూ సెల్ఫోన్లో మాట్లాడుతుండటంతో భార్యపై అనుమానం పెంచుకున్నాడు భర్త శంకర్.

ఈ విషయమై తరచూ భార్యాభర్తలు ఇద్దరూ గొడవ పడేవారు. మంగళవారం కూడా వీరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపంతో భర్త శంకర్ పక్కనే ఉన్న చెక్కతో భార్య తలపై బలంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని శంకర్ ను అరెస్టు చేసినట్లు తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios