Asianet News TeluguAsianet News Telugu

స్క్రీనింగ్ కమిటీ షాక్... భేటీ మధ్యలోంచి రేవంత్ బయటకు...

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై డిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశమయ్యింది. ఈ సమావేశంలో నియోజకవర్గాలవారిగా అభ్యర్థుల ఎంపికను ఫైనల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని కాంగ్రెస్ నాయకులు, ఆశావహులు ఉత్కంటతో ఎదురుచూస్తున్నారు. 

revanth team shock on screening committee decission
Author
New Delhi, First Published Nov 6, 2018, 5:33 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై డిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశమయ్యింది. ఈ సమావేశంలో నియోజకవర్గాల వారిగా అభ్యర్థుల ఎంపికను ఫైనల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని కాంగ్రెస్ నాయకులు, ఆశావహులు ఉత్కంటతో ఎదురుచూస్తున్నారు. 

అయితే ఈ సమావేశంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఈ సమావేశం నుండి అర్ధాంతరంగా బైటకు వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. తన సెక్యూరిటీ విషయంలో హోమంత్రితో అపాయింట్ మెంట్ ఉందంటూ చెప్పి ఆయన బైటికి వెళ్లిపోయారని సమాచారం. రేవంత్ ఈ సమావేశం మధ్యలోనుంచి వెళ్లిపోవడంపై పలు ఊహాగానాలు మొదలయ్యాయి. 

రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరే క్రమంలో తెలుగు దేశం పార్టీ నుండి చాలామంది  నాయకులను కాంగ్రెస్ లోకి తీసుకువచ్చారు. ఆ సమయంలో వారికి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం రేవంత్ కోరిన వారికి సీట్లివ్వడానికి స్క్రీనింగ్ కమిటీ సుముఖత వ్యక్తం చేయలేదని....అందువల్లే ఆయన సమావేశం మధ్యలోంచి వెళ్లిపోయాడని ప్రచారం జరుగతోంది.

ఇక ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల అభ్యర్థులను దాదాపు ఖరారుచేసినట్లు తెలుస్తోంది. మిగతా జనరల్ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది. ఇక కూటమిలోని పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు అంశం ఈ సమావేశంలో ఓ కొలిక్కి రానున్నట్లు తెలుస్తోంది.  

మరిన్ని వార్తలు 

కేసీఆర్ తాగుబోతు, కర్రు కాల్చి కారు గుర్తుకు వాత పెట్టండి: రేవంత్ రెడ్డి

పట్నం బ్రదర్స్ పై రేవంత్ రెడ్డి సీరియస్ ఆరోపణలు

రేవంత్‌కు సెక్యూరిటీ పెంపు: 4+4 గన్‌మెన్లతో భద్రత

రేవంత్‌కి భద్రతను పెంచమన్న హైకోర్టు.. కేంద్రానిదే బాధ్యత

Follow Us:
Download App:
  • android
  • ios