వావి వరసలు మరిచి ఓ అన్న సొంత చెల్లెల్లిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మూడేళ్లుగా ఆమెను బెదిరిస్తూ అఘాయిత్యానికి పాల్పడుతూ వచ్చాడు. విసుగు చెందిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

ప‌లువురు మ‌గాళ్లు కామంతో కండ్లు మూసుకుపోయి పిచ్చి పిచ్చిగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. వావి వ‌ర‌స‌లు మ‌రిచి సొంత వాళ్ల‌పైనే అత్యాచారాల‌కు పాల్ప‌డుతున్నారు. లైంగికంగా వేధింపుల‌కు గురి చేస్తున్నారు. అత్యాచారాల‌ను నిరోధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎన్ని చ‌ట్టాలు తెచ్చినా.. ప‌లు ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నా ఈ వేధింపులు ఆగ‌డం లేదు. ప‌సి పిల్ల‌ల నుంచి ముసలి వాళ్ల దాకా ఎవ‌రినీ వ‌ద‌ల‌డం లేదు. త‌రచూ మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న ఇలాంటి ఘ‌ట‌న‌లు వెలుగులోకి వ‌స్తున్నాయి. 

తాజాగా స‌భ్య స‌మాజం త‌ల‌దించుకునే ఘ‌ట‌న ఒక‌టి హైద‌రాబాద్ లో వెలుగులోకి వ‌చ్చింది. సొంత చెల్లెల్లిపైనే ఓ అన్న అత్యాచారానిక పాల్ప‌డ్డాడు. ఒక‌టి కాదు రెండు కాదు మూడేళ్ల నుంచి ప‌లు మార్లు ఆమెపై అఘాయిత్యానికి పాల్ప‌డుతున్నాడు. ఈ వేధింపులు భ‌రించ‌లేక బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయ‌డంతో ఈ ఘ‌ట‌న బ‌య‌ట‌కు వ‌చ్చింది. నిందితుడిపై కేసు న‌మోదు అయ్యింది. 

బాలీవుడ్ సినిమా నుంచి ప్రేర‌ణ పొంది.. విక‌లాంగ యువకుడిని హతమార్చిన మైన‌ర్

దీనికి సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. హైద‌రాబాద్ లోని హిమాయ‌త్ న‌గ‌ర్ లో నేపాల్ కు చెందిన ఓ కుటుంబం సెటిల్ అయ్యింది. ఆ కుటుంబంలో ఇద్ద‌రు దంప‌తులు, ఓ కూతురు, ఓ కుమారుడితో క‌లిసి ఉంటున్నారు. అయితే 2019 సంవ‌త్స‌రంలో ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యం చూసి కుమారుడు రోహ‌న్ నాయుడు త‌న చెల్లెల్లిని అత్యాచారం చేశాడు. ఆ స‌మ‌యంలో బాలిక వ‌య‌స్సు 16 సంవ‌త్స‌రాలు.

ఈ విష‌యాన్ని కూతురు త‌న త‌ల్లిదండ్రుల‌కు తెలియ‌జేసింది. అయితే దీనిని వారు ప‌ట్టించుకోలేదు. తేలిక‌గా తీసుకున్నారు. అప్ప‌టి నుంచి చెల్లెల్లిని బెదిరింపుల‌కు గురి చేస్తూ అన్న ప‌లు మార్లు ఆమెపై అఘాయిత్యానికి పాల్ప‌డుతూ వ‌స్తున్నాడు. అది ఈ ఏడాది జూన్ వ‌ర‌కు కొన‌సాగింది. అదే నెల‌లో ఆమె నేపాల్ కు వెళ్లింది. తిరిగి వ‌చ్చి ఇంట్లో ఉండ‌కుండా ఓ హాస్టల్ మాట్లాడుకొని అందులోనే ఉంటోంది. అయినా అన్న చెల్లెల్లికి ఫోన్ చేస్తూనే ఉన్నాడు. తీవ్ర మాన‌సిక వేధింపుల‌కు పాల్ప‌డుతూనే ఉన్నాడు.

ఈ వేధింపుల‌ను భ‌రించ‌లేక బాధితురాలు గ‌త నెల 30వ తేదీన నారాయ‌ణ‌గూడ పోలీసులను ఆశ్ర‌యించింది. త‌న‌పై జ‌రిగిన అఘాయిత్యాన్ని మొత్తం వారికి వివ‌రించింది. అన్న‌పై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడిపై పోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు. ద‌ర్యాప్తు చేస్తున్నారు. 

పన్నీరు సెల్వంకు షాకిచ్చిన‌ హైకోర్టు .. పార్టీ పగ్గాలు పళనిస్వామికే

ఇలాంటి ఘ‌ట‌నే గ‌తేడాది జూలైలో తిరుప‌తిలో వెలుగులోకి వ‌చ్చింది. వ‌ర‌సకు చెల్లెలు అయిన బాలిక‌పై ఓ వ్య‌క్తి బెదిరింపుల‌కు పాల్ప‌డి అత్యాచారం చేశాడు. వివ‌రాలు ఇలా ఉన్నాయి. తిరుపతికి చెందిన ఓ వ్యక్తి చంద్రగిరి మండలానికి చెందిన మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమె ద్వారా ఓ కుమారుడు పుట్టాడు. అయితే కొన్నాళ్లకే ఆమె భర్త నుంచి విడిపోయింది. మరొకరిని వివాహం చేసుకుని కుమారుడితో పాటు వడమాలపేటలో నివాసం ఉండేది. 

కలెక్టర్‌ను నిలదీసిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్.. మోడీ ఫొటో ఏదంటూ ఫైర్

మొదటి భార్యతో విడిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఆమె చెల్లెలిని పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు కూతుళ్లు పుట్టారు. రెండో కూతురికి 14 ఏళ్లు. మొదటి భార్య కుమారుడు (16) తరుచుగా తిరుపతిలోని తన తండ్రి, చిన్నమ్మ ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో ఒక రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన 14 ఏళ్ల చెల్లెను బెదిరించి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత మళ్లీ కొన్నాళ్లకు అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడు. కొన్నాళ్లకు బాలిక గర్భం దాల్చింది. ఆమె శరీరంలో ఏర్పడుతున్న మార్పులను గమనించి తల్లి ప్రశ్నించింది. దాంతో బాలిక అసలు విషయం చెప్పింది. దాంతో తల్లి చైల్డ్ కేర్ ప్రతినిధులకు విషయాన్ని తెలిజేసింది. పోలీసులు పోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు.