Asianet News TeluguAsianet News Telugu

మంచిర్యాలలో దారుణం.. అందరూ చూస్తుండగానే యువకుడి హత్య.. బండలతో కొడుతున్న వీడియో వైరల్..

మంచిర్యాల ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పలువురు కలిసి నడి రోడ్డుపై, పట్టపగలు హతమార్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Atrocious in Mancharya.. The murder of a youth while everyone was watching.. The video of beating him with stones went viral..ISR
Author
First Published Apr 26, 2023, 7:55 AM IST

మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. పట్టపగలు అందరూ చూస్తుండగానే ఓ యువకుడిని పలువురు హత్య చేశారు. కత్తితో బండలతో మోదుతూ, కత్తితో దాడి చేస్తూ అతడిని హతమార్చారు. ఈ ఘటన ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒక్క సారిగా కలకలం రేపింది. అయితే అతడిని దాడి చేస్తున్న సమయంలో పలువురు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది.

పంజాబ్ మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ మరణం.. 2 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించిన కేంద్రం

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లాలోని జైపూర్‌ మండలం ఇందారం గ్రామానికి అనుబంధంగా ఉన్న నజీర్‌పల్లికి చెందిన మహేష్ లారీ డ్రైవర్ గా పని చేసేవాడు. దీంతో పాటు అతడు పాల వ్యాపారం కూడా చేసేవాడు. అయితే అతడు కొంత కాలం కిందట ఇందారం గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఈ విషయం యువతి కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో ఆమెను వేరే యువకుడికి ఇచ్చి పెళ్లి చేసి పంపించారు. 

మద్యం మత్తులో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య..

దీనిని తట్టుకోలేకపోయిన మహేష్.. ఆ యువతికి మెసేజ్ లు పంపించడం, వాట్సప్ లో కాల్స్ చేయడం మొదలు పెట్టాడు. అలాగే ప్రేమలో ఉన్నప్పుడు తీసుకున్న వీడియోలు, ఫోటోలను యువతి భర్తకు పంపించాడు. దీంతో భర్త ఆమెకు విడాకులు ఇచ్చాడు. అనంతరం మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పటి నుంచి యువతి కుటుంబ సభ్యులు మహేష్ మీద కోపంగా ఉన్నారు. భర్త చనిపోవడంతో యువతి తన పుట్టింటికి వచ్చింది. అయినప్పటికీ మహేష్ ఊరుకోకుండా ఆమెకు మళ్లీ మెసేజ్ చేయడం మొదలుపెట్టాడు. పలు మార్లు యువతి ఇంటికి కూడా వెళ్లాడు. దీంతో యువతి కుటుంబ సభ్యులు మహేష్ పై దాడి చేశారు. ఈ వ్యవహారం గత అక్టోబర్ లో పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. దీంతో రెండు వర్గాలపై పోలీసులు కేసు నమోదులు చేశారు. అనంతరం కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. 

ప్రపంచ పటంలో భారత్ వెలిగిపోతోంది - కేరళ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ

తరువాత కూడా మహేష్ ప్రవర్తనలో మార్పు రాలేదు. యువతికి ఇంటికి పలు మార్లు వచ్చాడు. దీంతో అతడిపై దాడి కూడా చేశారు. ఇక అప్పటి నుంచి అతడిపై కోపం పెంచుకున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం టూ వీలర్ పై ఇంటికి వెళ్తున్న మహేష్ తో గొడవ పెట్టుకున్నారు. అతడిని అత్యంత కిరాతకంగా నడిరోడ్డులో అందరూ చూస్తుండగా హతమార్చారు. ఈ సమయంలో పలువురు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది.

ఇప్పుడు కాదు.. పుల్వామా దాడి జరిగిన రోజే నేను ప్రశించాను.. అమిత్ షా వ్యాఖ్యలు అబద్దం - సత్యపాల్ మాలిక్

ఈ హత్యపై బాధితుడి తల్లితో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేశారు. దీంతో ఏసీపీ నరేందర్ అక్కడికి చేరుకున్నారు. న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన ఆపేశారు. తరువాత మహేష్ డెడ్ బాడీని మంచిర్యాల గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. సాయంత్రం సమయంలో మళ్లీ బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తాము చెప్పిన వారిపై తప్పకుండా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మళ్లీ పోలీసులు వారిని శాంతింపజేశారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్టు సీఐ రాజ్ కుమార్ వెల్లడించారు. దర్యాప్తు ప్రారంభించామని పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios