Asianet News TeluguAsianet News Telugu

పంజాబ్ మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ మరణం.. 2 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించిన కేంద్రం

పంజాబ్ మాసీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ మరణానికి నివాళులు అర్పిస్తూ కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. ఈ రెండు రోజుల పాటు అధికారిక వినోదం ఉండదని, జాతీయ జెండాను సగం ఎత్తులో ఎగురవేయాలని ఓ ప్రకటనలో పేర్కొంది. 

Former Punjab CM Prakash Singh Badal's death. Center has announced mourning days for 2 days..ISR
Author
First Published Apr 26, 2023, 6:41 AM IST

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన మరణానికి నివాళులు అర్పిస్తూ దేశవ్యాప్తంగా సంతాప దినాలు పాటించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 26, 27వ తేదీ (నేడు, రేపు)ల్లో  రెండు రోజుల పాటు సంతాప దినాలుగా పాటించాలని పేర్కొంది. క్రమం తప్పకుండా ఎగురవేసే అన్ని భవనాలపై జాతీయ పతాకాన్ని సగం ఎత్తులో ఎగురవేస్తామని, ఈ రెండు రోజులు ఎలాంటి అధికారిక వినోదం ఉండదని తెలిపింది.

ప్రపంచ పటంలో భారత్ వెలిగిపోతోంది - కేరళ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, మరణాన్ని ఆయన కుమారుడు, ఎస్ఏడీ  పార్టీ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ వ్యక్తిగత సహాయకుడు ధృవీకరించారు. భటిండాలోని బాదల్ గ్రామంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయని తెలిపార. కాగా ప్రకాశ్ సింగ్ బాదల్ 1970-71, 1977-80, 2007-2017 మధ్య పంజాబ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయనకు భార్య సురీందర్ కౌర్ బాదల్, కుమారుడు సుఖ్బీర్ సింగ్ బాదల్, కోడలు హర్సిమ్రత్ కౌర్ బాదల్ ఉన్నారు.

ఇప్పుడు కాదు.. పుల్వామా దాడి జరిగిన రోజే నేను ప్రశించాను.. అమిత్ షా వ్యాఖ్యలు అబద్దం - సత్యపాల్ మాలిక్

పంజాబ్ రాష్ట్రానికి పిన్న వయసులోనే సీఎం బాధ్యతలు చేపట్టిన నేతగా ప్రకాశ్ సింగ్ బాదల్‌కు రికార్డు ఉన్నది. 43 ఏళ్ల వయసులోనే ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్నారు. రాజస్తాన్ సరిహద్దుకు సమీపంలోని పంజాబ్‌కు చెందిన అబుల్ ఖురానాలో జన్మించారు. గ్రామ సర్పంచ్‌గా ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1957లో అంటే ఆయన 30 ఏళ్ల వయసులో అసెంబ్లీ ఎన్నికలకు తొలిసారి పోటీ చేశారు.

మద్యం మత్తులో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య..

కాగా..  2015లో ఆయనకు దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ అవార్డు లభించింది. అయితే రెండు సంవత్సరాల కిందట పంజాబ్ రైతులు మహా ఆందోళనల చేపట్టినప్పుడు, వారిని కేంద్ర ప్రభుత్వం సరిగా ట్రీట్ చేయడం లేదనే కారణంతో నిరసనగా ఆయన తన పద్మ విభూషణ్ అవార్డును వెనక్కిచ్చేశారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios