Asianet News TeluguAsianet News Telugu

మద్యం మత్తులో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య..

ఉత్తరప్రదేశ్ లో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి ఫుల్లుగా మద్యం సేవించి నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అనంతరం హత్య చేశాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

Drunkenness is worse.. Rape and murder of a four-year-old child..ISR
Author
First Published Apr 25, 2023, 8:54 AM IST

మద్యం మత్తులో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. నాలుగేళ్ల చిన్నారి అని కూడా చూడకుండా ఆ పాపపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. అనంతరం హత్య చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బులంద్‌షెహర్ జిల్లాలో చోటు చేసుకుంది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

అకాల వర్షాలు.. తెలంగాణ సరిహద్దుల్లో పిడుగు పడి నలుగురి మృతి

జహంగీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ దారుణానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నాలుగేళ్ల బాలిక ఆదివారం సాయంత్రం  4:30 గంటల సమయంలో తన ఇంటి సమీపంలో ఆడుకుంటోంది. పక్కన ఇంట్లో నివాసం ఉండే 30 ఏళ్ల వ్యక్తి మద్యానికి బానిస అయ్యాడు. ఇదే సమయంలో అతడు ఇంటి నుంచి బయటకు వచ్చాడు. అప్పటికే ఫుల్లుగా మద్యం సేవించి ఉన్న అతడు.. బాలిక దగ్గరకు వచ్చి మభ్యపెట్టాడు. తన ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం బాలికను చంపేశాడు.

మరో యవతితో వివాహం.. ప్రియుడిపై యాసిడ్ పోసిన ప్రియురాలు.. పురుషుడి వేశంలో వచ్చి మరీ దాడి..

అయితే బాలిక చాలా సేపటి నుంచి కనిపించకుండా పోయేసరికి కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. చిన్నారి కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో నిందితుడి ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో మొదట అతడు వారిని అడ్డుకున్నారు. బాలిక తన ఇంట్లో లేదని చెప్పాడు. కొంత సమయం తరువాత కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. బలవంతంగా తలుపులు తీసి చూశారు. అయితే ఆ సమయంలో బాధిత చిన్నారి అపస్మారక స్థితిలో మంచం కింద పడి ఉండడాన్ని వారు గుర్తించారు. నిందితుడు కూడా మద్యం మత్తులో మంచంపై పడి ఉన్నాడు. అనంతరం ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. 

ఈ ఘటనపై  అనుప్‌షాహర్ సర్కిల్ ఆఫీసర్ అన్వితా ఉపాధ్యాయ్ స్పందిస్తూ.. నిందితుడు మృతదేహం దగ్గర మత్తులో పడి ఉన్నాడని చెప్పారు. ఈ విషయంపై విచారణ కొనసాగుతోందని, నిందితులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. అతడి అరెస్టు చేశామని పేర్కొన్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios