ప్రజా గాయకుడు.. ప్రజా యుద్ద నౌకగాపేరున్న ఉద్యమ కారుడు..రచయిత గద్దర్ నేడు(ఆదివారం) కన్నుమూశారు. రచయితగా, గాయకుడిగా  ఆయన ప్రస్థానం ఎంతో మందికి స్పూర్తిదాయకం.. ఆయన రచించి పాడిన ఎన్నో పాటలు ఆడియన్స్ ను ఉర్రూతలూగించాయి. 

ప్రజాయుద్ధ నౌక‌ 'గద్దర్' ఆదివారం కన్నుమూశారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని గద్దర్ కుమారుడు అధికారికంగా వెల్లడించారు. గద్దర్‌గా సుపరిచితుడైన ఆయన అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. మెదక్ జిల్లాలోని తూప్రాన్ గ్రామంలో ఆయన జన్మించారు. తల్లి పేరు లచ్చమ్మ, తండ్రిపేరు శేషయ్య. 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు. 

ఉద్య‌మ‌కారుడిగా, గాయ‌కుడిగా ఆయ‌న తెలంగాణ స‌మాజంపై చెర‌గ‌ని ముద్రవేశారు. ముఖ్యంగా ఆయన రాసిన పాటులు ప్రజా చైతన్య ధివిటీలుగా వెలిగాయి. యువ ఉద్యమకారులు నరనరాన నిండి ఉత్సాహాన్ని ఉరకలు వేసేలా చేశాయి. ప్రజా గాయకుడిగా బయట స్టేజ్ ల మీద పెర్ఫామ్ చేస్తూ.. ఇటు ఉద్యమ సినిమాలకు కూడా ఆయన పాటలు రాశారు. సినిమాల్లో ఉద్యమ పాటల ద్వారా ఆయన ప్రజలకు ఇంకా త్వరగా చేరువయ్యారు. మరీ ముఖ్యంగా దాసరి నారాయణ రావు.. ఆర్ నారాయణమూర్తి సినిమాలకు గద్దర్ ఎక్కువగా పాటలు రాశారు. 

1979 లో మా భూమి సినిమాలో గద్దర్ రాసి బండెనక బండి కట్టి పాటను వాడారు. నిజానికిరజాకార్ల ఉద్యమం కోసంవిప్లవ గీతంగా గద్దర్ రాసి పాడిన ఆ పాటల.. జన హృదయాలను గెలిచింది. యువతను ఉర్రూతలూగించింది. ఇన్నేళ్ళు అవుతున్న ఇంకా ఇప్పటికీ బండెనక బండి కట్టీ.. అంటూ పాట వినిపిస్తూ ఉంది అంటే.. గద్దర్ రచన.. ఆయన గాత్రం.. భావం ఎంతలా ప్రజల హృదయాల్లో నిలిచిపోయిందో అర్ధం అవుతుంది. 

YouTube video player


ఇక 1995 లో.. దాసరి నారాయణరావ్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా ఓరేయ్ రిక్ష. ఆర్ నారాయణమూర్తి ముఖ్యం పాత్రలో నటించిన ఈసినిమాలో ఆల్మెస్ట్ అన్ని పాటలు గద్దరే రాశారు. ముుఖ్యంగా ఆయన రాసిన నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా పాట ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసినిమాలో నా రక్తంతో నడుపుతాను రిక్ష్యాను అంటూ.. గద్దర్ ఆవేశంతో రాసిన లిరిక్స్ కు.. అంతకు డబుల్ పెర్ఫామెన్స్ తో రక్తి కట్టించాడు ఆర్ నారాయణ మూర్తి. 

YouTube video player

ఇక ఓరే రిక్షలోని నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా పాటకు.. స్టేట్ నందీ అవార్డ్ కూడా వచ్చింది. అయితే ఆ అవార్డ్ ను ఆయన తిరస్కరించాడు. నందీ అవార్డ్ ను ఆయన స్వీకరించలేదు. ఇలా ఎన్నో సినిమా పాటలు రాసిన గద్దర్.. తన పాటల ప్రభావంతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశారు. తెలుగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేస్తున్న వేల.. పోడుస్తున్న పొద్దు మీద.. పోరు తెంగాణమా.. అంటూ గద్దర్ పాటలకు ఉద్యమం ఎగసి పడింది. ఎక్కడ చూసినా అదే పాట మారుమోగి పోయింది. ఇప్పటికీ ఆ పాట వింటే రోమాలు నిక్కబొడుకుకంటాయంటే.. అతిశయోక్తి కాదు.. 

YouTube video player


ఇక సినిమా పాటలే కాదు.. తెలంగాణ పేదల బ్రతుకు మెతుకుల మీద.. రజకార్ల అన్యాయాల మీద.. తెలంగాణ తల్లి కడుపు కోతమీద.. గద్దర్ రాసిన పాటలు ప్రతీ ఒక్క హృదయాన్ని కదిలించి వేశాయి. తెలంగాణ ప్రజలు పడుతున్న నొప్పుల విలువను తెలుపుతూ... అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా.. అంటూ గద్దరు తన గాత్రంతో పాడితే.. ఎక్కడక్కడి నుంచో తెలంగాణ ప్రజలుస్పందించి కదం తొక్కారు.. కాలు కదిపారు.. గొంతు కలిపారు.. 

ఆయనకు జీవితంలో అతి పెద్ద ప్రమాదం జరిగినా.. ఆరోగ్యం సహకరించకపోయినా.. ఎన్నో వేదికల మీద గద్దర్.. అద్భుతంగా నాట్యం చేసేవారు.. పాట పాడుతూ.. ఆడియన్స్ ను ఉర్రూతలూగించేవారు. ఉద్యమపాటలకు పదాల చమత్కారాలు జోడించి గద్దర్ గాత్రం నుంచి జాలువారుతుంటే.. అవి ఆణిముత్యాలై.. ప్రేక్షకుల హృదయాలను ద్రవింపచేసేవి. పేద బ్రతుకులు.. పెత్తం దారుల పోకడలను ఎండగడుతూ.. ఆయన ఎన్నో పాటలు రాశారు.. పాడారు. 

తన గాత్రంతో.. రచనతో తెలంగాణ సమాజాన్ని ప్రభావితం చేసి.. ఆదర్శంగా నిలిచిన గద్దర్ అలియాస్ గుమ్మడి విఠల్ రావు మరణం .. తెలంగాణ సమాజానికి.. సాహితీలోకానికి.. తీరనిలోటు..ఆయన మృతి విషయం తెలిసి సినీ రాజకీయా ప్రముఖులుసంతాపం ప్రకటిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరకుంటున్నారు.