హైదరాబాద్‌లో నడిరోడ్డుపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి.. పాతకక్షలు, వివాహేతర సంబంధాలు, కుటుంబ తగాదాలతో కొందరు వ్యక్తులు తెలిసిన వారి చేతుల్లోనే దారుణహత్యకు గురవుతున్నారు..

నడిరోడ్డుపై సాటి మనిషిని చంపుతున్నా జనాలు సినిమా చూస్తున్నారు తప్పించి.. ఒక్కరంటే ఒక్కరు కూడా పట్టించుకున్న పాపాన పోవడం లేదు. తాజాగా గుడిమల్కాపూర్ కూరగాయల మార్కెట్ వద్ద ఓ వ్యక్తిని కొందరు గొడ్డలితో విచక్షణారహితంగా నరికారు.

కార్వాన్ హీరానగర్ ప్రాంతానికి చెందిన అనిల్‌గౌడ్‌కు 20 ఏళ్ల క్రితం రాజ్యలక్ష్మీ అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు... గుడిమల్కాపూర్ మార్కెట్ గేటు వద్ద ప్లాస్టిక్ కవర్ల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉండటంతో వీరు విడి విడిగా ఉంటున్నారు.

ఈ క్రమంలో రాజ్యలక్ష్మీ బంధువులు రవి, రాకేశ్‌లు గొడ్డళ్లతో బుధవారం మార్కెట్‌కు వచ్చి పట్టపగలే అనిల్‌ గౌడ్‌పై దాడి చేశారు. ఈ దాడిలో అనిల్‌గౌడ్ తలకు, మెడకు తీవ్రగాయాలయ్యాయి. రక్తపుమడుగులో పడివున్న అనిల్ చనిపోయాడనుకున్న వారు అక్కడి నుంచి పారిపోయారు.

స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు. మార్కెట్ ప్రాంతంలో వందల సంఖ్యలో జనాలు ఉన్నా ఈ దాడిని ఎవ్వరూ అడ్డుకోకపోవడం గమనార్హం. అనిల్ సోదరుడు రాములగౌడ్ విషయం తెలుసుకుని తమ్ముడిని ఆసుపత్రికి తరలించాడు. సీసీ కెమెరా ఫుటేజ్ సాయంతో నిందితులను గుర్తించిన పోలీసులు వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

జుట్టు పట్టి ఈడ్చుకెళ్లి, తలపై బండరాయితో మోది... నడిరోడ్డుపై యువతి దారుణ హత్య

షాక్: ప్రేయసి కోసం నడిరోడ్డుపై ప్రియుడు ఏం చేశాడంటే?

దారుణం: నడిరోడ్డుపై భార్యను నరికి చంపిన భర్త

నడిరోడ్డుపై శృంగారం, జైల్లో కాపురం..!

అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై జంట రాసలీలలు