అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై జంట రాసలీలలు

Bizzare incident: Couple resorted to love making publicly
Highlights

జనమంతా చూస్తుండగా ఆ జంట కామకేళీ విలాసంలో తేలింది.

ముంబై: జనమంతా చూస్తుండగా ఆ జంట కామకేళీ విలాసంలో తేలింది. అత్యంత రద్దీగా ఉండే ముంబైలోని మెరైన్ డ్రైవ్ రోడ్డులో శృంగారం సాగించింది. అటుగా వెళ్లే వాళ్లు కొందరు ఫొటోలు తీశారు, మరికొంత మంది వీడియోలు తీశారు.

ఆ జంట శృంగార లీలలు రోడ్ డివైడర్ పై సాగింది. ఆ స్థలం రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర కార్యాలయాలకు కూత వేటు దూరంలో మాత్రమే ఉంది. శుక్రవారంనాడు అందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది.  

కొద్ది మంది పోలీసు కంట్రోల్ రూంకు ఫోన్ చేసి చెప్పారు. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారిని చూడగానే దుస్తులు సరిచేసుకుని జంట పారిపోవడానికి ప్రయత్నించింది. భారీ ట్రాఫిక్ లో స్త్రీపురుషులిద్దరు రోడ్డు దాటి అవతలి వైపునకు చేరుకున్నారు. 

చివరకు పోలీసులు మహిళను పట్టుకోగలిగారు. పురుషుడు విదేశీస్థుడని తెలుస్తోంది. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. జంట శృంగారం నెరిపిన ప్రాంతమైన మెరైన్ డ్రైవ్ ను క్వీన్స్ నెక్లెస్ అని కూడా పిలుస్తారు.

ఆ ప్రాంతం ఎయిర్ ఇండియా భవనానికి, మెరైన్ హోటల్ ప్లాజాకు మధ్యన ఉంది. స్త్రీ మానసిక స్థితి బాగా లేనట్లు కనిపిస్తోంది. మహిళను చెంబూరులోని మహిళా సురక్ష కేంద్రానికి పంపించారు. 

మహిళ గోవాకు చెందిందని ప్రాథమిక విచారణలో తేలింది. ఆ తర్వాత అయోమయంగా మాట్లాడుతూ వచ్చింది. విదేశీయుడిని గుర్తించడానికి పోలీసులు సిసీటీవి ఫుటేజీలను పరిశీలించారు. స్థానిక హోటళ్లలో తనిఖీలు కూడా నిర్వహించారు. ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తనిఖీలు చేశారు. 

loader