నడిరోడ్డుపై శృంగారం, జైల్లో కాపురం..!

Police Arrest Two After Having Sex On The Street
Highlights

పాపం వాళ్లు ఇళ్లు మరచారో లేక వళ్లు మరచారో తెలియదు కానీ, నడిరోడ్డుపై శృంగారం చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.

పాపం వాళ్లు ఇళ్లు మరచారో లేక వళ్లు మరచారో తెలియదు కానీ, నడిరోడ్డుపై శృంగారం చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ సంఘటన అమెరికాలో జరిగింది. అమెరికాలోని ఓక్లహామా నగరంలో బాగా రద్దీగా ఉండే ఓ నాలుగు రోడ్ల కూడలి వద్ద శృంగారం చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

పబ్లిక్ ప్లేస్‌లో ఉన్నామని కూడా చూడకుండా, వీరిద్దరూ వళ్లు మరచిపోయి మద్యం మత్తులో తమ పనిలో బిజీగా ఉండిపోయారు. అదే రోడ్డుపై వెళ్తున్న చాలా మంది వాహనదారులు మాత్రం తమకెందుకులే అనుకొని చూసీచూడనట్లు ముందుకు సాగిపోతోంటే అటుగా వెళ్తున్న ఓ మహిళ పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది.

ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ పోలీసులు మాత్రం అరక్షణంలో అక్కడ ప్రత్యక్షమై వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని అరెస్టు చేసి జైలుకు పంపించారు. వారిపై అసభ్యంగా వ్యవహరించడం, బహిరంగంగా మద్యం సేవించడం (ఇండీసెంట్ ఎక్స్‌పోజర్ మరియు పబ్లిక్ డ్రంక్) వంటి కేసులు నమోదు చేశారు. కాగా.. ఇదే మహిళ గతంలో కూడా ఓ లిక్కర్ దుకాణం ముందు పార్కింగ్ లాట్‌లో సెక్స్ చేస్తూ పోలీసులకు దొరికినట్లు కూడా సమాచారం.

loader