కాంగ్రెస్ గూటికి మరో మాజీ మంత్రి, బీజేపీ నేత చంద్రశేఖర్.. ? అందుకే కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి డుమ్మా !
మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుబోతున్నారని తెలుస్తోంది. ఆయనతో పాటు ఓ నిజామాబాద్ మాజీ పోలీసు కమిషనర్ కూడా హస్తం గూటికి వెళ్లబోతున్నారని సమాచారం.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో నాయకులు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి మారిపోతున్నారు. అయితే కర్ణాటక విజయంతో మంచి జోష్ మీద ఉన్న కాంగ్రెస్ లోకి ఎక్కువగా వలసలు పెరిగిపోతున్నాయి. బీఆర్ఎస్ పై అసంతృప్తిగా ఉన్న నేతలు, అలాగే బీజేపీలోని ముఖ్య నాయకులూ కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. తాజాగా మరో కమలం నేత, మాజీ మంత్రి ఏ.చంద్రశేఖర్ కూడా హస్తం గూటికి చేరబోతున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి.
తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం సీనియర్ అధికారి పాణిరావు ఇక లేరు..
తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్ లో బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమానికి చంద్రశేఖర్ గైర్హాజరయ్యారు. ఇది ఆయన కాషాయ పార్టీని వీడబోతున్నారనే వాదనకు బలాన్ని చేకూరుస్తోంది. ఇటీవల బండి సంజయ్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతల నుంచి తప్పించి, కిషన్ రెడ్డికి పదవి కట్టబెట్టిన నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిని కలిసి చంద్రశేఖర్ కలిసి అభినందనలు తెలిపారు. అయితే ఆ సమయంలో తప్పుడు సంకేతాలు వెళ్లాయి అనే ఉద్దేశంతో తాజా గా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లలేదని అర్థమవుతోంది.
ఐదో తరగతి బాలికపై సోదరుడి అత్యాచారం.. ఎవరికీ తెలియకూడదని మరో ఇద్దరితోనూ కలిసి..
కాగా.. మరో మాజీ పోలీసు ఉన్నతోద్యోగి కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నట్టు తెలుస్తోంది. నిజామాబాద్ మాజీ పోలీసు కమిషనర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ నాగరాజు హస్తం పార్టీలో వస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఆయన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని శుక్రవారం ఆయన నివాసంలో కలవడం పార్టీలో చేరుతున్నారనే వాదనలకు బలాన్నిస్తోంది. వరంగల్ జిల్లాకు చెందిన ఆ మాజీ పోలీసు అధికారి.. ఈ నెల 28వ తేదీన కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా హస్తం పార్టీ దిక్కు చూస్తున్నారని సమాచారం. ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర మాజీ జనరల్ సెక్రటరి తాళ్లూరి జీవన్‌కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని శుక్రవారం కలిచి చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ఆయన హస్తం కండువా కప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఆయన వెంట పలువురు టీడీపీ నాయకులు కూడా ఉన్నారు.