తన భర్తను అతి కిరాతకంగా హత్య చేయించిన తన తండ్రికి బెయిల్ ఇవ్వరాదని అమృత వేడుకుంది. రెండు నెలల క్రితం.. మిర్యాలగూడలో ప్రణయ్ అనే యువకుడిని అతి దారుణంగా నడిరోడ్డుపై నరికి చంపిన సంగతి తెలిసిందే.  కాగా ప్రణయ్‌ పరువు హత్య కేసు నిందితులకు నల్ల గొండ ఎస్సీ, ఎస్టీ స్పెషల్‌ కోర్టు బెయిల్‌ నిరాకరించినట్లు మిర్యాలగూడ డీఎస్పీ పి.శ్రీనివాస్‌ బుధవారం తెలిపారు.

ప్రణయ్‌ హత్య అనంతరం పోలీసులు నమో దు చేసిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో నిందితులైన ఏ1 తిరునగరు మారుతీరావు, ఏ3 అస్గర్‌అలీ, ఏ4 అబ్దుల్‌బారీ, ఏ5 కరీం, ఏ6 తిరునగరు శ్రవణ్, ఏ7 శివ బెయిల్‌ కోసం నల్లగొండ ఎస్సీ, ఎస్టీ స్పెషల్‌ కోర్టులో íపిటిషన్‌ దరఖాస్తు చేసుకున్నారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు.. వారికి బెయిల్‌ తిరస్కరిస్తున్నట్లు తెలిపింది.

బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు జరుగుతున్న సమయంలో ప్రణయ్‌ భా ర్య అమృతవర్శిణి, ప్రణయ్‌ తండ్రి బాలస్వామి కోర్టుకు హాజరయ్యారు. నిందితులకు బెయిల్‌ ఇవ్వరాదని ఎస్సీ, ఎస్టీ పబ్లిక్‌ ప్రాసిక్యుటర్‌ మోకిని సత్యనారాయణగౌడ్‌ వాదించినట్లు డీఎస్పీ శ్రీనివాస్‌ తెలిపారు.

  అమృత వర్షిణి న్యాయమూర్తి హుస్సైబ్‌ హైమద్‌ ఖాన్‌ ఎదుట హాజరై ఈ కేసులో నిందితులకు బెయిల్‌ ఇవ్వొద్దని విజ్ఞప్తి చేసింది. బెయిల్‌ ఇస్తే నిందితులు సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉందని తమకు రక్షణ ఉండదని ఆమె ఈ సందర్భంగా న్యాయమూర్తికి తెలిపింది.

 

read more news

ప్రణయ్ కాంస్య విగ్రహం: అమృతకు అందించిన తమిళనాడు దంపతులు

ప్రణయ్ హత్య నిందితులపై పీడీ యాక్ట్

ప్రణయ్ ఆత్మతో మాట్లాడిస్తాం: అమృత ఏం చేసిందంటే...

అమృతను కించపరుస్తూ కామెంట్...యువకుడు అరెస్ట్

అసభ్యకరమైన పోస్టులు.. పోలీసులకు అమృత ఫిర్యాదు

పోలీసులపై అనుమానం వ్యక్తం చేసిన ప్రణయ్ తండ్రి

ప్రణయ్ హత్య: ఎవరీ బారి...మారుతీరావుతో లింకు ఇలా...

నల్గొండ జిల్లాలో పరువు హత్యలు: నాడు నరేష్, నేడు ప్రణయ్

ప్రణయ్ హత్య: మాజీ ఉగ్రవాదితో అమృత తండ్రి ఒప్పందం

ప్రణయ్ విగ్రహం.. కోర్టు ఏమందంటే..

ప్రణయ్ హత్య: మారుతీరావు ఇంట్లో పోలీసుల సోదాలు