ఆరోపణలు కాదు దమ్ముంటే నాపై పోటీ చెయ్ : రాహుల్ కు అసదుద్దీన్ సవాల్

తమపై విద్వేషంతోనే రాహుల్ గాంధీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసి ఆరోపించారు. దమ్ముంటే తమపై పోటీ చేయాలని... అప్పుడు బలమేంటో చూపిస్తామని సవాల్ విసిరారు. 

AIMIM Chief Asaduddin Owaisi Challenge to Rahul Gandhi AKP

సంగారెడ్డి : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మజ్లిస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసిన తెలిసిందే. ఎంఐఎం పార్టీ ఏ ఎన్నికల్లో పోటీచేసినా అది బిజెపికి లాభం చేసేందుకేనని... తెలంగాణలోనూ ఇప్పడు అలాగే చేస్తోందన్నారు. బిజెపి నుండి డబ్బులు తీసుకుంటున్న ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసి కాంగ్రెస్ పై అభ్యర్థులను నిలబెడుతున్నారని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇలా రాహుల్ గాంధి ఎంఐఎం పార్టీపైనా, తనపైనా రాహుల్ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసి ఘాటుగా స్పందించారు. 

గత పార్లమెంట్ ఎన్నికల్లో అమేథీలో ఓడిపోవడానికి బిజెపి నుండి నువ్వెంత తీసుకున్నావంటూ రాహుల్ ను నిలదీసారు ఎంఐఎం అధినేత. తనపేరు అసదుద్దీన్ ఓవైసి.. నెత్తిపై టోపీ, గడ్డం వుందికాబట్టే రాహుల్ తనపై ఆరోపణలు చేస్తున్నాడని అన్నారు. ఎంఐఎం బలమేంటో రాహుల్ నాన్నమ్మ ఇందిరాగాంధీకి బాగా తెలుసు... అందువల్లే ఆమె దారుసల్లాం వచ్చారన్నారు. కానీ రాహుల్ కు తమ బలమేంటో  తెలియడం లేదని...  త్వరలోనే దాని రుచి చూపిస్తామన్నారు. ఈ గడ్డం, టోపీదారులే రాహుల్ కు తగిన బుద్ది చెబుతారని ఓవైసి హెచ్చరించారు. 

ఇటీవల కర్ణాటక ఎన్నికల సందర్భంగా డిల్లీలోని తన ఇంటికి రాహుల్ ఒకరిని పంపారని అసదుద్దీన్ అన్నారు. అతడు తనతో ఓ విషయం చెప్పాడు... ఆ రహస్యం ఏమిటో చెప్పమంటావా? అని రాహుల్ ని అడిగారు. కాంగ్రెస్ కు సంబంధించిన ఇలాంటి ఎన్నో విషయాలను తాను బైటపెట్టగలనని అసదుద్దీన్ ఓవైసి హెచ్చరించారు. 

Read More  డబ్బుల సంచులతో వస్తారు .. ఏమిచ్చిన తీసుకోండి

కేవలం మతపరమైన విద్వేషంతోనే రాహుల్ తనపై విమర్శలు చేస్తున్నారని అసదుద్దీన్ అన్నారు. తన స్నేహితులు జ్యోతిరాధిత్య సింధియా, జితిన్ ప్రసాద్ కాంగ్రెస్ ను వీడి బిజెపిలో చేరారు... మరి వారి గురించి రాహుల్ ఎందుకు మాట్లాడడని ప్రశ్నించారు. మీకు మేమంటే ధ్వేషం కాబట్టి ఏ ఆరోపణలైనా చేస్తారు అని అన్నారు. 

రాహుల్ గాంధీ ఎక్కడెక్కడికో వెళుతూ తమపై ఆరోపణలు చేయడంకాదు... దమ్ముంటే తనతో ప్రత్యక్షంగా పోటీపడాలని అసదుద్దీన్ సవాల్ విసిరారు. నాతో పోటీకి సిద్దమేనా రాహుల్... తాడోపేడో తేల్చుకుందాం అంటూ అసదుద్దీన్ ఛాలెంజ్ విసిరారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios