Asianet News TeluguAsianet News Telugu

డబ్బుల సంచులతో వస్తారు .. ఏమిచ్చిన తీసుకోండి

తెలంగాణ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అన్ని పార్టీలు  ప్రచారంలో దూకుడు పెంచాయి. ఈ తరుణంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి  గులాబీ పార్టీ అధినేతపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

Congress Ponguleti Srinivasa Reddy Comments On CM KCR in Election Campaign KRJ
Author
First Published Nov 3, 2023, 1:54 PM IST | Last Updated Nov 3, 2023, 1:54 PM IST

తెలంగాణ రాజకీయం వేడేక్కింది. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకపోతున్నాయి. ఈ తరుణంలో అధికార,, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్దాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి  గులాబీ పార్టీ అధినేత  కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు మునిగేపల్లిలో  పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్.. తెలంగాణ ప్రజల మోసం చేసి అక్రమంగా కోట్లాడి రూపాయాలను  సంపాదించడాని, ఆ డబ్బుల సంచులతో ఎన్నికల సమయంలో మీ ముందుకు వస్తాడనీ, ఆ డబ్బును తీసుకోండని, కానీ ఓటు మాత్రం.. కాంగ్రెస్ వేయడని సూచించారు.  బీఆర్ఎస్ నేతలు మాయమాటలు, దొంగ మాటలు చెప్పుతారనీ, ఎవరిని నమ్మొద్దని అన్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బులను ఎంత ఇచ్చినా.. తీసుకోవాలని, ఆ డబ్బు తెలంగాణ ప్రజలదేనని అన్నారు. ఓటు మాత్రం హస్తం పార్టీకి వేయాలని కోరారు.  

కేసీఆర్ ప్రభుత్వం ఐదు లక్షల కోట్లను అప్పు చేసిందని విమర్శించారు. అనేక మంది యువకుల బలిదానం ఫలితం తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందనీ,  తెలంగాణా ఆత్మగౌరవం కాపాడాలని సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని అన్నారు. కేసీఆర్ తన గారడీ మాటలతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారనీ, ఆ మాటలు నమ్మే ఆయనను రెండుసార్లు ముఖ్యమంత్రిని చేశారని అన్నారు. రాష్ట్ర యువతకు ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందనీ, బీఆర్ఎస్ పెట్టిన ఏ పరీక్షైనా లీకు కావాల్సిందేనని ఎద్దేవా చేశారు. ప్రశ్న ప్రతాలను అమ్ముకుంటున్నారని, తెలంగాణ యువతను కల్వకుంట్ల కుటుంబం బలి తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుటంబానికి మాత్రం నాలుగు ఉద్యోగాలు వచ్చాయని మండిపడ్డారు. కాళేశ్వరంలో రెండు ప్రాజెక్టులలో ఒక ప్రాజెక్టు 150 మీటర్లు కుంగి పోయిందని అసహనం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ఏటీఎంల వాడుకుందన్నది. ఈ విషయంలో  బీజేపీ ఒక్కసారి కూడా ప్రశ్నిచలేదనీ, ఇక్కడే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల దోస్తీ తెలుస్తుందని పొంగులేటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios