హైదరాబాద్ లో వీధికుక్కల బెడద నివారణకు కార్యాచరణ ప్రణాళికలు.. ఫిర్యాదులకోసం ఫోన్ నెం. ఏర్పాటు..
వీధికుక్కల దాడుల్లో చిన్నారుల బలవుతున్న ఘటనలను అరికట్టడానికి నగరపాలక సిబ్బంది నడుం బిగించింది. వీధి కుక్కల బెడద నివారణకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు.
హైదరాబాద్ : హైదరాబాద్‌లో వీధి కుక్కలు దాడిలో ఓ బాలుడు మృతి చెందిన ఘటన, ఆ తరువాత మరో బాలుడి మీద దాడి ఘటన వెంటవెంటనే జరిగిన నేపథ్యంలో నగర అధికారులు స్టెరిలైజేషన్ ప్రయత్నాలను ముమ్మరం చేయడానికి నడుం బిగించారు. వీధి కుక్కలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తిస్తున్నారు.
ఆదివారం హైదరాబాద్‌లో ఐదేళ్ల బాలుడిని వీధికుక్కలు దాడి చేసి.. దారుణంగా కరవడంతో తీవ్ర రక్తస్రావంతో, గాయాలతో ఆ చిన్నారి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఇది వెలుగులోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటన మీద చర్యలు తీసుకునేలోపే.. బుధవారం మరో పసిబిడ్డ వీటి బారిన పడ్డాడు. ఇంటి బయట ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలుడిని కుక్కలు వెంటపడి కరిచాయి. తల్లిదండ్రులు వెంటనే అలర్ట్ అవ్వడంతో పెనుప్రమాదం తప్పింది.
ఉయ్యాలలో పడుకోబెట్టిన పసికందుపై కోతుల దాడి.. బొటనవేలు కొరికేసి బీభత్సం..
నగరంలో వీధికుక్కల అరాచకం మీద హైకోర్టు కూడా ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించింది. వీధి కుక్కల సమస్యకు పరిపాలన పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందని హైదరాబాద్ గవర్నర్ అన్నారు. బుధవారం జరిగిన సమావేశంలో ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్‌కుమార్ నగర వెటర్నరీ అధికారులు, జోనల్ కమిషనర్‌లకు వీధి కుక్కల బెడద నివారణకు కార్యాచరణ ప్రణాళికను వివరించారు.
కుక్కల దాడులు ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాలను గుర్తించాలని, వాటిని అరికట్టేందుకు పశువైద్య బృందాలు తగిన చర్యలు తీసుకోవాలని కుమార్ అన్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, బాంకెట్ హాల్స్, మాంసం దుకాణాలు వీధి కుక్కలను ఆకర్షించే విధంగా వీధుల్లో ఆహార వ్యర్థాలను వేయకుండా నిరోధించాలని నగర మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
హైద్రాబాద్ లో వీధికుక్కల స్వైరవిహారం: రాజేంద్రనగర్‌లో ఐదుగురిపై దాడి
ప్రస్తుతం నగర పరిధిలో నివసిస్తున్న 5.7 లక్షల వీధికుక్కల్లో 4 లక్షల కుక్కలకు స్టెరిలైజ్ చేశారు. నిరంతర స్టెరిలైజేషన్ డ్రైవ్‌ల కారణంగా 2011లో 8.5 లక్షలుగా ఉన్న వీటి సంఖ్య ప్రస్తుతం 5.7 లక్షలకు తగ్గింది. నగరంలో పెంపుడు జంతువుల కోసం ప్రత్యేక మొబైల్ యాప్ రిజిస్ట్రేషన్‌ను అభివృద్ధి చేయాలని, దాని యజమానికి గుర్తింపు కార్డును జారీ చేయాలని శ్రీ కుమార్ అధికారులకు సూచించారు.
విషాదం : నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి.. తీవ్రగాయాలతో చిన్నారి మృతి..
దీంతో పాటు కరపత్రాలు, హోర్డింగ్‌లు సిద్ధం చేయాలని, పాఠశాలలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కుక్కలు సాధారణంగా మనుషులపై దాడి చేయవని పశువైద్య వైద్యులు అంటున్నారు, అయితే సంతానోత్పత్తి కాలంలో, వేసవిలో ఆహారం తక్కువగా ఉండటం వల్ల మగ కుక్కలు దూకుడుగా ఉంటాయని అన్నారు. వీధి కుక్కల మీద ఫిర్యాదులు చేయడానికి ప్రత్యేక నెం.ను అందుబాటులోకి తెస్తామని అన్నారు. ఈ మేరకు వీధి కుక్కల గురించి ఫిర్యాదుల చేయడానికి 040 - 21111111 అనే ల్యాండ్ లైన్ నెం. ను తెలిపారు. ఎవరైనా ఈ నెం.కు కాల్ చేయచ్చని అన్నారు.