నా భర్త మృతదేహన్ని అప్పగించండి: చెన్నకేశవులు భార్య
తన భర్తను ఎన్‌కౌంటర్ చేసినట్లుగానే, అత్యాచార కేసుల్లో నిందితులుగా జైళ్లలో ఉన్నవారిని కూడా చంపేయాలని దిశ కేసు నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్య రేణుక డిమాండ్ చేస్తోంది
తన భర్తను ఎన్‌కౌంటర్ చేసినట్లుగానే, అత్యాచార కేసుల్లో నిందితులుగా జైళ్లలో ఉన్నవారిని కూడా చంపేయాలని దిశ కేసు నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్య రేణుక డిమాండ్ చేస్తోంది.
ఎన్‌కౌంటర్ జరిగినందుకు దేశ ప్రజలంతా సంబరాలు చేసుకుంటున్నారని కానీ గతంలో ఇలాంటి సంఘటనలు చేసిన నిందితులను కూడా ఇలానే కాల్చేయాలని డిమాండ్ చేస్తోంది.
Also read:తెలంగాణలో సంచలనం రేపిన ఎన్ కౌంటర్లు ఇవే: హీరో సజ్జనార్
నిందితుల మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించకుండా నేరుగా అంత్యక్రియలు నిర్వహించడాన్ని ఆమె తప్పుబడుతున్నారు. తన భర్త మృతదేహాన్ని తమకు అప్పగిస్తే, పొలం వద్ద అంత్యక్రియలు నిర్వహించుకుంటామని రేణుక కోరారు.
అంతకు ముందు ఉదయం మీడియాతో మాట్లాడిన ఆమె.. తన భర్తను ఎన్‌కౌంటర్ చేసిన చోటే తనను చంపేయాలని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్తను అన్యాయంగా పోలీసులు చంపేశారని రేణుక ఆరోపిస్తోంది.
ఒక అమ్మాయి కోసం నలుగురిని పొట్టనబెట్టుకున్నారని.. దిశ తన చెల్లెలికి కాకుండా పోలీసులకు ఫోన్ చేసుంటే ఈ ఘోరం జరిగి వుండేది కాదని ఆమె పేర్కొంది. ఈ కేసులో కోర్టు తీర్పు ఇవ్వకముందే పోలీసులు ఇలా చేయడాన్ని రేణుక తప్పుబట్టింది.
Also Read:Justice For Disha:ఎన్‌కౌంటర్‌పై సజ్జనార్ వివరణ ఇదీ...
దిశపై అత్యాచారం , హత్యకు పాల్పడిన నిందితులను శుక్రవారం తెల్లవారుజామున తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే.
నిందితులు తమపై దాడికి పాల్పడ్డారు, కాల్పులు కూడ జరిపారు. తమ హెచ్చరికలను కూడ నిందితులు వినలేదు, దీంతో తాము జరిపిన కాల్పుల్లో దిశ రేప్, హత్య కేసులో నిందితులు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్టుగా సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు.
Also Read:దిశను బూతులు తిడుతూ... నిందితుడి బంధువు షాకింగ్ కామెంట్స్
దిశ సెల్‌ఫోన్, వాచీలను చూపిస్తామని నిందితులు తమకు చెప్పారన్నారు. ఈ వస్తువులను చూపించే క్రమంలోనే తమపై దాడికి పాల్పడి ఆయుధాలను లాక్కొన్నారని సీపీ చెప్పారు.
ఈ సమయంలో పోలీసులు నిందితులను హెచ్చరించినట్టుగా తెలిపారు. కానీ నిందితులు మాత్రం పట్టించుకోలేదన్నారు. ఈ క్రమంలోనే నిందితులపై తాము కాల్పులు జరిపినట్టుగా ఆయన తెలిపారు.