Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ బీజేపీకి పెద్ద షాక్.. ‘కమలం’ను వీడి ‘హస్తం’ అందుకున్న కీలక నేత.. మళ్లీ బలపడుతున్న కాంగ్రెస్

తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ బలం పుంజుకుంటోంది. పలు పార్టీల నుంచి ఆ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా బీజేపీలో కీలకంగా ఉన్న మెదక్ జిల్లా నేత పట్లోళ్ల శశిధర్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 

A shock to Telangana BJP.. A key leader left the party and joined Congress..  Congress is getting stronger in the state..ISR
Author
First Published May 28, 2023, 9:48 AM IST

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ బలపడుతోంది. చాలా కాలంగా గెలుపు రుచి చూడని ఆ పార్టీకి.. కర్ణాటక విజయం కొండంత బలాన్ని ఇచ్చింది. దీంతో ఆ పార్టీకి దేశ వ్యాప్తంగా ఉన్న నేతల్లో ఆత్మస్థైర్యం పెరిగింది. తెలంగాణలో కూడా ఆ పార్టీ నేతలు ఈ సారి రాష్ట్రంలో జెండా ఎగురవేసేది కాంగ్రెస్సే అనే ధీమాతో ఉన్నారు. దీంతో మరింత ఉత్సాహంగా పని చేస్తున్నారు. పార్టీని క్షేత్ర స్థాయిలో మళ్లీ బలంగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇతర పార్టీల నేతలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.

ఘోరం.. వివాహేతర సంబంధాన్ని ప్రశ్నిస్తోందని.. భార్యపై వేడి సాంబార్ పోసిన భర్త..

కర్ణాటక రాష్ట్రంలో ఆ పార్టీ గెలుపు జోష్ తెలంగాణలోనూ కనిపిస్తోంది. ఇతర పార్టీలో టిక్కెట్ దక్కదని భావించిన కీలక నేతలు, ఆయా పార్టీలపై అసంతృప్తిగా ఉన్న నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఈ క్రమంలో బీజేపీలో చాలా కాలంగా కీలకంగా ఉన్న ఓ నేత ఆ పార్టీకి షాక్ ఇచ్చి కాంగ్రెస్ లో చేరారు. కొన్నేళ్ల కిందట కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మరో సీనియర్ నేత మాణిక్యం ఠాగూర్ లు ఆయనను శుక్రవారం కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు సత్తుపల్లిలో బీఆర్ఎస్ కు కీలకంగా ఉన్న నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్, డాక్టర్ మట్టా రాగమయి ‘హస్తం’ అందుకున్నారు. 

సొంతగూటికి చేరుకున్న శశిధర్ రెడ్డి ఫ్యామిలీకి మెదక్ జిల్లాలో రాజకీయంగా మంచి పేరు ఉంది. ఆయన తండ్రి నారాయణ రెడ్డి 1989-1994 పాటు మెదక్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా సేవలు అందించారు. తరువాత శశిధర్ రెడ్డి కూడా ఉమ్మడి మెదక్ జిల్లాకు యూత్ కాంగ్రెస్ చీఫ్ గా పని చేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో శాసన సభలో ఆయన కాంగ్రెస్ అసోసియేట్ మెంబర్ గా ఉన్నారు. 2004 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మెదక్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే గా విజయం సాధించారు. 2009లో వచ్చిన ఎన్నికల్లో ఓడిపోయారు. కాగా.. 2014 వచ్చిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం నటి విజయశాంతికి టికెట్ ఇచ్చింది. కానీ బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) ప్రభంజనం కొనసాగుతున్న ఆ సమయంలో ఆ పార్టీ తరుఫున పోటీ చేసిన పద్మాదేవేందర్ రెడ్డి అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే విజయశాంతి ఓటమికి శశిధర్ రెడ్డి కారణమయ్యారని, టిక్కెట్ కేటాయించలేదని ఆయన ఇలా చేశారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దీనిని ఆయన అవమానంగా భావించారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

చావులో సైతం వీడని స్నేహం.. స్నేహితుడి చనిపోయాడని, చితిలో దూకిన వ్యక్తి..

కొంత కాలం తరువాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న విజయశాంతి కూడా బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆమె ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ బీజేపీ అధిష్టానం మెదక్ అసెంబ్లీ టికెట్ ను ఆమెకే కేటాయిస్తుందనే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో తన రాజకీయ భవితవ్యంపై ఆలోచించిన పటోళ్ల.. సొంత గూటికి చేరిపోయారు. అంతకు ముందు బీఆర్ఎస్ లో చేరుతారని వార్తలు వచ్చినా.. ఆయన హస్తం వైపే మొగ్గు చూపారు. సొంత పార్టీ తనకు కచ్చితంగా టికెట్ ఇస్తుందనే భావనలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

హత్యకు గురైన బీజేపీ కార్యకర్త ప్రవీణ్ నెట్టారు భార్య ఉద్యోగం తొలగించిన కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం..

కాంగ్రెస్ పార్టీలోకి సాగుతున్న వలసలపై ఆ పార్టీ తెలంగాణ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ లో ఉంటే గెలవడం కష్టం అని, బీజేపీలో ఉంటే బతుకే శూన్యం అని భావిస్తున్న నేతలు కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారని ఆయన ఓ ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తే కాంగ్రెస్ కు మళ్లీ మంచి రోజులు మొదలైనట్టు కనిపిస్తోంది. మళ్లీ బలం పుంజుకుంటోందని స్పష్టమవుతోంది. ఎన్నికలు దగ్గరకు వచ్చే కొద్దీ ఇతర పార్టీల్లో బలమైన నేతలు కూడా కాంగ్రెస్ లోకి వస్తారని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. అయితే పార్టీలోకి చేరిన నేతలందరికీ టిక్కెట్లు కేటాయించడం ‘హస్తం’కు సవాల్ గా మారే అవకాశాలు ఉన్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios