కుక్క దాడి నుంచి తప్పించుకునేందుకు ఓ డెలివరీ ఎగ్జిక్యూటివ్ మూడో అంతస్తు నుంచి కిందకి దూకి తీవ్ర గాయాలపాలయ్యాడు. హైదరాబాద్ లోని మణికొండ ప్రాంతంలో ఉన్న ఓ అపార్ట్ మెంట్ లో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

కుక్క దాడి నుంచి తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో ఓ డెలివరీ ఎగ్జిక్యూటివ్ అపార్ట్ మెంట్ భవనం మూడో అంతస్తు నుంచి కిందకి దూకాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. ఈ ఏడాది జనవరి తర్వాత నగరంలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి.

తాగొచ్చి పెళ్లి పీటలెక్కిన వరుడు.. దండలు మార్చుకుంటుండగా పెళ్లి వద్దని తేల్చి చెప్పిన వధువు.. ఎక్కడంటే ?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 30 ఏళ్ల డెలివరీ ఎగ్జిక్యూటివ్ మహ్మద్ ఇలియాస్ ఓ కస్టమర్ కు పరుపు డెలివరీ చేయడానికి మణికొండలోని పంచవటి కాలనీ ఉన్న శ్రీనిధి హైట్స్ అపార్ట్ మెంట్ లో మూడో అంతస్తుకు వెళ్లాడు. అయితే కస్టమర్ ఫ్లాట్ దగ్గరికి వెళ్లాడు. అక్కడ పాక్షికంగా తెరిచి ఉన్న డోర్ వద్ద కుక్క మొరగడం ప్రారంభించింది. కొంత సమయం తరువాత ఆ డాబర్ మన్ అతడిపైకి వచ్చింది. దీంతో కుక్క నుంచి తనను తాను రక్షించుకోవడానికి ఇలియాస్ ప్రహరీ గోడపైకి ఎక్కి కిందకి దూకాడు. 

Scroll to load tweet…

కస్టమర్, ఇతర నివాసితులు అతడిని రక్షించడానికి వచ్చారు. కానీ అప్పటికే అతడికి గాయాలు అయ్యాయి. బాధితుడిని వెంటనే చికిత్స కోసం సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనపై రాయదుర్గం పోలీసులు ఐపీసీ సెక్షన్ 289 కింద కేసు నమోదు చేశారు. కాగా..
డెలివరీ ఎగ్జిక్యూటివ్ చికిత్సకు అయ్యే ఖర్చును కుక్క యజమాని భరించాలని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ) ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది.

ట్యూషన్ క్లాసులు చెప్పేందుకు ఆర్థిక సాయం చేస్తానని టీచర్ పై అత్యాచారం.. అసహజ శృంగారం..

ఇటీవల జరిగిన మరో ఘటనలో 23 ఏళ్ల రిజ్వాన్ అనే యువకుడు క్రూరమైన పెంపుడు కుక్క వెంబడించడంతో భవనం మూడో అంతస్తు నుంచి దూకి మృతి చెందాడు. ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీలో పనిచేస్తున్న మహ్మద్ రిజ్వాన్.. ఫుడ్ పార్శిల్ డెలివరీ చేసేందుకు బంజారాహిల్స్ లోని ఓ అపార్ట్ మెంట్ బిల్డింగ్ కు వెళ్లాడు. ఆ సమయంలో ఈ ఘటన జరిగింది. కుక్క యజమానిపై బంజారాహిల్స్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తరువాత బాధిత కుటుంబం, కుక్క యజమాని ఆ తర్వాత సెటిల్మెంట్ కు అంగీకరించారు.