నల్గొండ: ఉమ్మడి నల్గోండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం దుగ్యాల వద్ద ఎలిమినేటి మాధవ రెడ్డి కాలువలో  కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. బాలుడిని స్థానికులు కాపాడారు.

Also read:కరీంనగర్‌‌లో బ్రిడ్జిపై నుండి కారు బోల్తా: ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు

 ఎలిమినేటి మాధవరెడ్డి కాలువలో ప్రమాదవశాత్తు కారు బోల్తా పడింది. ఈ ఘటనలో    ఒకే కుటుంబానికి చెందిన   రంగయ్య, అలివేలు, కీర్తి  మృతి చెందారు.  ఓ బాలుడిని స్థానికులు రక్షించారు.   

Also read:రాధిక కుటుంబం జల సమాధి: సీసీ కెమెరాల్లో కారు గుర్తింపు

పెద్దఅడిశర్లపల్లి మండలం వడ్డెరిగూడెం గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన రంగయ్య, అలివేలు, కీర్తి  మరో బాలుడు ts 07 ug 4494 అనే నెంబర్ కారులో ఓ పెళ్లికి ఇవాళ ఉదయం హాజరయ్యారు.

పెళ్లి నుండి తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో  ఈ ప్రమాదం చోటు చేసుకొంది. . కారు ముందు టైరు పేలడంతో ఈ ప్రమాదం వాటిల్లినట్టుగా స్థానికులు చెప్పారు.  కారు ముందు టైరు పేలడంతో అదుపుతప్పిన కారు  కాలువలోకి దూసుకెళ్లింది.  కారు కాలువలో దూసుకెళ్లడాన్ని చూసిన స్థానికులు వెంటనే  కారులో  ఉన్న ఓ బాలుడిని రక్షించారు. 

ఇటీవల కాలంలో కాలువల్లో కార్లు బోల్తా పడి మృతి చెందుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఈ మాసంలోనే రెండు ఘటనలు వెలుగు చూశాయి. పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరి రాధిక కుటుంబం గత నెల 27వ తేదీన కాకతీయ కాలువలో పడి మృతి చెందారు.

ఈ నెల 16వ తేదీన తిమ్మాపూర్ మండలం అలుగునూరు వద్ద కారు బోల్తా పడిన ఘటనలో ఒక్కరు మృతి చెందారు.తాజాగా ఇవాళ నల్గొండ జిల్లాలో మరో కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు.