కరీంనగర్ జిల్లా అలుగునూరు బ్రిడ్జి పై నుండి కారు బోల్తా పడిన ఘటనలో ఒకరరు మృతి చెంారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. 


కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూర్ మానేరు వంతెనపై కారు బోల్తా పడింద. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న సమయంలో ఓ కానిస్టేబుల్ కాలు జారి కిందపడ్డాడు. ఈ ఘటనలో ఆయన కూడ గాయపడ్డాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

 బ్రిడ్జిపై నుండి కారు కింద పడిన సమయంలో కారులో ముగ్గురు ఉన్నారు. కారులో భార్యాభర్తలతో పాటు మరో వ్యక్తి ఉన్నాడు. కారు లోయలో పడిన సమయంలో భర్త జెండి శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు.. ఆయన భార్య తీవ్రంగా గాయపడింది.

Also read:విషాదం: తల్లి అంత్యక్రియలకు వెళ్తూ కొడుకు, కోడలు మృతి

సంఘటన స్థలాన్ని పరిశీలిస్తూ కరీంనగర్ వన్‌టౌన్ బ్లూకోటుకు చెందిన చంద్రశేఖర్ అనే కానిస్టేబుల్ కూడ బ్రిడ్జి నుండి కిందపడిపోయాడు.దీంతో ఆయన కూడ తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

కొమురవెల్లి మల్లన్న దర్శనం కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొంది. కారులో ప్రయాణిస్తున్నవారు కరీంనగర్ పట్టణంలోని సుభాష్‌నగర్‌ కు చెందినవారుగా పోలీసులు గుర్తించారు.