Asianet News TeluguAsianet News Telugu

హీరో నాగశౌర్య ఫామ్‌హౌస్‌లో పేకాటరాయుళ్ల అరెస్ట్: రూ. 6 లక్షల నగదు స్వాధీనం

హైద్రాబాద్ నగర శివారులోని మంచిరేవులలోని హీరో నాగశౌర్య ఫామ్ హౌస్ లో పేకాట ఆడుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. నిందితుల నుండి రూ. 6 లక్షల నగదును స్వాధీనం చేసుకొన్నారు.

25 Arrested for Playing Cards at Hero Naga shourya Farm House in Hyderabad
Author
Hyderabad, First Published Oct 31, 2021, 9:42 PM IST

హైదరాబాద్: హైద్రాబాద్  శివారులోని పేకాట స్థావరాలపై ఎస్ఓటీ పోలీసులు ఆదివారం నాడు దాడులు నిర్వహించారు. పేకాటకు సంబంధించి కీలక సూత్రధారిగా ఉన్న సుమన్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. మరో వైపు పేకాట ఆడుతున్న నగరానికి చెందిన 25 మందిని  పోలీసులు  అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

హైద్రాబాద్ నగరంలోని రాజేంద్ర‌నగర్ పరిధిలోని మంచిరేవుల వద్ద ఉన్న ఓ ఫామ్‌హౌస్‌లో playing cards  ఆడుతున్నారనే పక్కా సమాచారంతో Sot పోలీసులు దాడులు నిర్వహించారు.ఈ Farm house ను సినీ నటుడు Naga shourya లీజుకు తీసుకొన్నాడని పోలీసులు గుర్తించారు.  అయితే ఈ వ్యవహరం హీరో నాగశౌర్యకు తెలిసి జరుగుతుందా లేదా అనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

also read:పేకాడుతూ దొరికిన మంత్రి మల్లారెడ్డి సోదరుడు..!

పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఫామ్‌హౌస్ లోని విల్లాలో పేకాట ఆడుతున్నవారిని అదుపులోకి తీసుకొన్నారు. మరోవైపు  పోలీసులు వచ్చిన విషయాన్ని గుర్తించిన కొందరు అక్కడి నుండి పారిపోయారు. అయితే పోలీసులకు 25 మంది చిక్కారు. వారిని నార్సింగ్ పోలీసులకు అప్పగించారు. ఈ ఫామ్‌హౌస్‌లో 24 కార్లను పోలీసులు స్వాధీనం చేసుొన్నారు. మరోవైపు టూ వీల్లరను కూడా పోలీసులు సీజ్ చేశారు.నిందితుల నుండి సుమారు రూ. 6.77 లక్షల నగదుతో పాటు మొబైల్స్ ను కూడా స్వాధీనం చేసుకొన్నారు. 

ఈ ఫామ్‌హౌస్ ను బర్త్ డే పార్టీ కోసం తీసుకొన్నారని  పోలీసులు గుర్తించారు.సుమన్ కుమార్ అనే వ్యక్తి  బర్త్ డే పార్టీ కోసం ఈ ఫామ్ హౌస్ ను బుక్ చేశారని పోలీసులు గుర్తించారు. ఈ పామ్ హౌస్ లో టేబుల్స్, పేక ముక్కలు, మద్యం బాటిల్స్ ఉన్నాయి. ఖరీదైన మద్యం బాటిల్స్ గా పోలీసులు గుర్తించారు. అయితే ఈ ఫామ్ హౌస్ నుండి తప్పించుకొనేందుకు కొందరు మద్యం బాటిల్స్ ను పోలీసులపైకి విసిరారని సమాచారం.

తెలంగాణలో టీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పేకాట క్లబ్‌లపై ఉక్కు పాదం మోపింది. పేకాట క్లబ్ లను మూసివేసింది. పేకాట క్లబ్ మూసివేయడంతో  హైద్రాబాద్ శివారులోని  విల్లాలు, ఫామ్ హౌస్ లను కేంద్రంగా చేసుకొని పేకాటరాయుళ్లు పేకాట కోసం వినియోగించుకొంటున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. పేకాట క్లబ్‌ల మాదిరిగానే డ్రగ్స్, గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలని కేసీఆర్ సర్కార్ భావిస్తోంది. 

మళ్లీ పేకాట కేసులు వెలుగు చూస్తుండడంతో పోలీసులు సీరియస్ గా దృష్టి కేంద్రీకరించారు. నగర శివార్లలో కూడా ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా పోలీసులు చర్యలను చేపట్టారు.పేకాట కారణంగా అనేక కుటుంబాలు తీవ్రంగా నష్టపోయిన విషయాన్ని గుర్తించిన  కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకొంది. పేకాట క్లబ్ లను తెరిపించాలని  కోరేందుకు కూడ ఎవరూ కూడా సాహసించడం లేదు. కేసీఆర్ సర్కార్ తీసుకొన్న ఈ నిర్ణయంపై మహిళలు పెద్ద ఎత్తున స్వాగతించారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలనే ఎక్సైజ్, పోలీసు శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.  గంజాయి, డ్రగ్స్ సరఫరా కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో గంజాయి కేసులు ఇటీవల ఎక్కువగా నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాల నుండి హైద్రాబాద్ మీదుగా గంజాయి అక్రమంగా సరఫరా అవుతుందని పోలీసులు గుర్తించారు.ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన పోలీసులు విశాఖ జిల్లాలో గంజాయి సరఫరాదారుల కోసం వెళ్లిన సమయంలో కాల్పులు చోటుచేసుకొన్నాయి.ఈ ఘటన రెండు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది.  

పేకాట క్లబ్‌లను మూసివేసినట్టుగా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను మారుస్తామని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ధీమాను వ్యక్తం చేశారు. నెల రోజుల్లో ఈ దిశగా తమ .ప్రభుత్వం చర్యలు తీసుకొంటుందని చెప్పారు. డ్రగ్స్ ,గంజాయి సరఫరా దారులపై ఎక్సైజ్ అధికారులు నిఘాను తీవ్రం చేశారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios