హైదరాబాద్ ఎల్బీ నగర్‌‌లో సంచలనం సృష్టించిన చైన్ స్నాచింగ్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ దోపిడీకి పాల్పడిన వారిలో ఇద్దరు దొంగలను హైదరాబాద్ సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఢిల్లీలో పట్టుకున్నారు.

గత బుధవారం ఎల్బీనగర్, హయత్‌నగర్ ప్రాంతాల్లో 15 గంటల వ్యవధిలో ఏకంగా 9 చైన్ స్నాచింగ్ ఘటనలు చోటు చేసుకోవడంతో నగరం ఉలిక్కిపడింది. దీనిని తీవ్రంగా పరిగణించిన రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటుచేసి దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

స్నాచింగ్‌కు పాల్పడిన వారు యూపీకి చెందిన వారుగా గుర్తించారు. వీరు విమానంలో యూపీ నుంచి హైదరాబాద్‌కు వచ్చి మరీ, ఈ వరుస స్నాచింగ్‌లకు పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. స్నాచింగ్‌కు పాల్పడిన అనంతరం సొమ్మును తీసుకుని వీరు విమానంలో తిరిగి యూపీ పారిపోయినట్లు తెలిసింది. దీంతో కమిషనర్ ఆదేశాల మేరకు ఒక బృందం ఢిల్లీ వెళ్లి ఇద్దరు దొంగలను పట్టుకుంది. 

హైదరాబాద్ చైన్ స్నాచింగ్ కేసులో పురోగతి...

హైదరాబాద్‌లో చెయిన్ స్నాచింగ్‌...ఆటకట్టించిన పోలీసులు

బంటీ & బబ్లీ స్టైల్లో చైన్ స్నాచింగ్

యూట్యూబ్ వీడియోలు చూసి చైన్ స్నాచింగ్ కు పాల్పడిన యువకులు