Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్‌లో చెయిన్ స్నాచింగ్‌...ఆటకట్టించిన పోలీసులు

హైదరాబాద్ లోని నిర్మానుష్యంగా ఉండే రోడ్లపై ఒంటరిగా తిరగడానికి మహిళలు, వృద్దుల భయపడిపోతున్నారు. ఇలాంటి ప్రాంతాలపై కన్నేసిన చెయిన్ స్నాచర్లు బైక్ లపై రయ్యిమంటూ వచ్చి రెప్పపాటులో దోపిడీ చేసి పరారవుతున్నారు. తాజాగా ఇలాగే ఆన్నోజీగూడా, ఘట్కేసర్ లలో దొంగలు మహిళపై దాడులకు పాల్పడి మరీ బంగారు అభరణాలను ఎత్తుకెళ్లారు. అయితే ఈ దొంగతనం కేసును వారం రోజుల్లోనే పోలీసులు చేదించి దొంగలను అదుపులోకి తీసుకున్నారు.  

police arrested chain snatchers in hyderabad
Author
Hyderabad, First Published Nov 2, 2018, 6:17 PM IST

హైదరాబాద్ లోని నిర్మానుష్యంగా ఉండే రోడ్లపై ఒంటరిగా తిరగడానికి మహిళలు, వృద్దుల భయపడిపోతున్నారు. ఇలాంటి ప్రాంతాలపై కన్నేసిన చెయిన్ స్నాచర్లు బైక్ లపై రయ్యిమంటూ వచ్చి రెప్పపాటులో దోపిడీ చేసి పరారవుతున్నారు. తాజాగా ఇలాగే ఆన్నోజీగూడా, ఘట్కేసర్ లలో దొంగలు మహిళపై దాడులకు పాల్పడి మరీ బంగారు అభరణాలను ఎత్తుకెళ్లారు. అయితే ఈ దొంగతనం కేసును వారం రోజుల్లోనే పోలీసులు చేదించి దొంగలను అదుపులోకి తీసుకున్నారు.  

ఈ దొంగతనానికి  సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గత నెల 26వ తేదీన ఘట్కేసర్ లో చెన్నూరు భాగ్యలక్ష్మి అనే మహిళ పై కొందరు దుండగులు దాడిచేసి దోపిడీకి పాల్పడ్డారు. బాధిత మహిళ అరవకుండా నోరు మూసి ఆమె మెడలో వున్న 5 గ్రాముల బంగారు మంగళ సూత్రాన్ని లాక్కుని పరారయ్యారు. దీంతో ఆమె తనపై జరిగిన దాడి, దొంగతనం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

అయితే ఘట్కెసర్ ప్రాంతంలో వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులను చూసి ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా వ్యవహరించారు. దీంతో వారిని పట్టుకుని విచారించగా ఘట్కేసర్ లో మహిళపై దాడి చేసి బంగారాన్ని లాక్కెళ్లింది వాళ్లేనని తేలింది. ఈ ముగ్గురిలో ఎలమంద ప్రదీప్ కుమార్ పై గుంటూరులో బైక్ దొంగతనం కేసు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.  

పట్టుబడ్డ నిందితుల నుండి పోలీసులు 5గ్రాముల బంగారు ఆభరణంతో పాటు ఓ పల్సర్ బైక్, మొబైల్ పోన్, ట్యాబ్లెట్ ను స్వాధీనం చేసుకున్నారు.  
  
Follow Us:
Download App:
  • android
  • ios