యూట్యూబ్ వీడియోలు చూసి చైన్ స్నాచింగ్ కు పాల్పడిన యువకులు

Thief Snatched Chain From Woman at kphb
Highlights

కూకట్ పల్లి లో హైటెక్ చైన్ స్నాచర్స్

యూట్యూబ్... ఇంటర్నెట్ ప్రపంచంలో వీడియోల సముద్రం. ఇందులో అదీ, ఇదీ అని లేదు, ప్రతి విషయానికి సంబంధించిన వీడియోలు ఉంటాయి. ఈ వీడియోలు కొన్ని సందర్భాల్లో మంచిపనులకు ఉపయోగపడుతుండగా, మరికొన్నిసార్లు నేరగాళ్లకు ఉపయోగపడుతున్నాయి. ఇలా  యూట్యూబ్ లో చైన్ స్నాచింగ్ ఎలా చేయాలో వీడియోలు చూసి ఇద్దరు యువకులు హైదరాబాద్ లో చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు. 

ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన వల్లెపు తిరుపతిరాజు(27), సాంబశివరావు(42)లు హైదరాబాద్ లోని కేపీహెచ్‌బీ కాలనీలో నివాసముంటున్నారు. వీరు పెయింటింగ్‌ పనులు చేస్తూ జీవిస్తున్నారు.

అయితే వీరు ఈజీగా మనీ ఎలా సంపాదించాలని ప్లాన్ వేశారు. దీనికోసం యూట్యూబ్ ను ఆశ్రయించారు. ఇందులో చైన్ స్పాచింగ్ ఎలా చేయవచ్చు, చేసి ఎలా తప్పించుకోవచ్చో పరిశీలించారు. ఈ ప్రకారం ఈ నెల 4వ తేదీన సీబీసీఐడీ కాలనీలో వెంగమాంబ(58) అనే మహిళ మెడలో ఆరు  తులాల బంగారు గొలుసును లాక్కొని పారిపోయారు. 

వీరు ఎంత చాకచక్యంగా స్నాచింగ్ చేసినా సీసీ ఫుటేజీ వారిని పట్టించింది. వారి బైక్ నంబర్ ఆధారంగా పోలీసులు వీరి ఆచూకీ అరెస్ట్ చేశారు. వీరి నుండి బంగారు గొలుసు స్వాధీనం చేసుకొన్నారు. 
 

loader