Telangana Election results: సీఎంగా రేవంత్ రెడ్డిని చూడాలని ఎంత మంది కోరుకుంటున్నారు..?

ఈ పార్టీలో సీఎం పదవి కోసం దాదాపు 11 మంది పోటీ పడుతున్నారట. ఈవిషయాన్ని  స్వయంగా రేవంత్ రెడ్డి ఓ సందర్భంలో చెప్పడం గమనార్హం. కాగా, ఈ నేపథ్యంలో, ఈ ఫలితాలకు ముందే ఓ ప్రముఖ మీడియా సంస్థ జనాలు ఎవరు ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు అనే విషయంపై సర్వే చేశారట.

Who will Be The CM  As per People survey ram

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంటోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖరారైంది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా స్వయంగా ఈ విషయంపై స్పందించాడు. కాంగ్రెస్ పార్టీకి అభినందనలు కూడా తెలియజేశాడు. దాదాపు పదేళ్ల నుంచి ఈ విజయం కోసం కాంగ్రెస్ ఎదురుచూస్తోంది. ఏళ్లనాటి కళ నేడు నిజమైంది. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనే విషయం హాట్ టాపిక్ గా మారింది.

బీఆర్ఎస్ లాంటి పార్టీకి అయితే, అలాంటి ప్రశ్నలు రావు. బీఆర్ఎస్ గెలిస్తే సీఎం కేసీఆర్ అవుతాడు. కానీ, కాంగ్రెస్ కావడంతో సీఎం పదవికి ఎవరికి ఇస్తారా అనే  ఆసక్తి పెరిగింది. ఈ పార్టీలో సీఎం పదవి కోసం దాదాపు 11 మంది పోటీ పడుతున్నారట. ఈవిషయాన్ని  స్వయంగా రేవంత్ రెడ్డి ఓ సందర్భంలో చెప్పడం గమనార్హం. కాగా, ఈ నేపథ్యంలో, ఈ ఫలితాలకు ముందే ఓ ప్రముఖ మీడియా సంస్థ జనాలు ఎవరు ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు అనే విషయంపై సర్వే చేశారట.

ఆ సర్వేలో కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే బాగుండని దాదాపు 21శాతం మంది కోరుకుంటున్నారట. మరో 22 శాతం మంది కాంగ్రెస్ పార్టీ నుంచి తమకు ఎవరు ముఖ్యమంత్రి అయినా పర్వాలేదని సమాధానం చెప్పడం విశేషం. ఈ లెక్కన ఎక్కువ మంది రేవంత్ రెడ్డి నే సీఎంగా కోరుకుంటున్నారు.  

ఒకవేళ బీఆర్ఎస్ గెలిచి ఉంటే, ముఖ్యమంత్రిగా ఎవరు కావాలి అనే విషయంపై కూడా సర్వే చేశారట.  దాంట్లో 33శాతం మంది కేసీఆర్ తమకు మళ్లీ సీఎంగా కావాలని కోరుకోగా, 15 శాతం మంది మాత్రం  కేటీఆర్ ముఖ్యమంత్రి గా రావాలని కోరుకున్నారట. మరో పది శాతం మంది మాత్రం తమకు ఏ పార్టీ గెలిచినా, ఎవరు సీఎం అయినా తమకు ఒకే అని చెప్పడం గమనార్హం.  ఇప్పుడు బీఆర్ఎస్ ఓటమిపాలైంది కాబట్టి, ఆ పార్టీ కి ఛాన్స్ లేదు.

ఛాన్స్ ఉన్నదంతా కాంగ్రెస్ కే. వీరిలో సీఎం ని ఎవరిగా పెట్టాలి అనేది కాంగ్రెస్ అధిష్టానం చేతిలో ఉంటుంది. మరి, ఈ విషయంలో రాహుల్ గాంధీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల లైవ్ అప్ డేట్స్...

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios