amit shah:కేసీఆర్ అవినీతిపై విచారించి జైలుకు పంపుతాం
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ ఉధృతం చేసింది. కేంద్ర మంత్రి అమిత్ షా ఇవాళ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవాలని ఆ పార్టీ వ్యూహంతో ముందుకు వెళ్తుంది. రేపటి నుండి మోడీ రాష్ట్రంలో పర్యటించనున్నారు.
ఆర్మూర్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్ )అవినీతిపై విచారణ జరిపించి జైలుకు పంపడం ఖాయమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ లో భారతీయ జనతా పార్టీ సకల జనుల విజయ సంకల్ప సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. కేసీఆర్ నీ సమయం అయిపోయిందని అమిత్ షా చెప్పారు. కేసీఆర్ సర్కార్ వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు.ఈ కుంభకోణాలపై బీజేపీ సర్కార్ విచారణ నిర్వహిస్తుందని ఆయన స్పష్టం చేశారు.అవినీతికి పాల్పడిన వారిని జైలుకు పంపుతామని ఆయన చెప్పారు.
also read:Jagat Prakash Nadda: బీఆర్ఎస్ అంటే భారత రాక్షస సమితి
ఇచ్చిన ఏ హమీని కూడ కేసీఆర్ అమలు చేయలేదని ఆయన విమర్శించారు.నిజామాబాద్ లో బీడి కార్మికులకు ప్రత్యేక ఆసుపత్రిని నిర్మిస్తామన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజీల్ ధరలను తగ్గిస్తామన్నారు.
also read:Rahul Gandhi:రాజస్థాన్‌లో నరేంద్ర మోడీపై పనౌటీ వ్యాఖ్యలు, ఈసీ షోకాజ్
10 ఏళ్లుగా తెలంగాణను బీఆర్ఎస్ నాశనం చేసిందన్నారు.1988లో ఇక్కడ బస్ డిపో కోసం శంకుస్థాపన చేసిన విషయాన్ని అమిత్ షా గుర్తు చేశారు.ఇప్పటివరకు బస్ డిపో ఏర్పాటు కాలేదన్నారు.బస్టాండ్ స్థలాన్ని ఆక్రమించి ఎమ్మెల్యే షాపింగ్ మాల్ కట్టారని అమిత్ షా ఆరోపించారు.
పసుపు బోర్డు ఏర్పాటు ద్వారా రైతులకు మంచి ధర లభిస్తుందన్నారు.పసుపు పరిశోధన కూడ చేపడుతామని అమిత్ సా చెప్పారు. గల్ఫ్ వెళ్లే వారి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు.తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు.ఓవైసీకి భయపడి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేసీఆర్ అధికారికంగా నిర్వహించడం లేదన్నారు.
కేసీఆర్ కు ఎవరు డబ్బులిస్తార్ వారికే మంత్రి పదవి లభిస్తుందన్నారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకుకు పాల్పడిన వారిని జైలుకు పంపుతామని అమిత్ షా తెలిపారు.దళిత వ్యక్తిని సీఎం చేస్తామని 2014లో కేసీఆర్ చెప్పారు.ఈ హామీని ఎందుకు అమలు చేయలేదని అమిత్ షా ప్రశ్నించారు.ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధిని సీఎం చేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే తొలి కేబినెట్ సమావేశంలోనే పెట్రో ఉత్పత్తులపై జీఎస్టీని తగ్గిస్తామన్నారు. తెలంగాణను నెంబర్ వన్ చేసే ప్రభుత్వం అధికారంలోకి రావాలనే ఆకాంక్షను అమిత్ షా వ్యక్తం చేశారు.ముస్లింలకు ఇస్తామన్న నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్ షా చెప్పారు.మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉందని అమిత్ షా చెప్పారు.