Revanth Reddy... బీజేపీ, బీఆర్ఎస్ తో పోటీ కాదు ..ఈడీ ,ఐటీ తోనే:రేవంత్ రెడ్డి

రైతు బంధు పథకం కింద లబ్దిదారులకు నిధులు పంపిణీ చేసేందుకు  ఈసీ అనుమతివ్వడంపై  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  విమర్శలు చేశారు.  

TPCC Chief Revanth Reddy Responds  on EC green signal to Rythu Bandhu funds release lns

హైదరాబాద్: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కటేనని అని మరోసారి రుజువైందని  కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు  అనుముల రేవంత్ రెడ్డి  ఆరోపించారు.  . శనివారంనాడు హైద్రాబాద్ లో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.   రైతుబంధు కు ఈసీ అనుమతి ఇవ్వడం చూస్తే  భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి మధ్య  బంధం ఉందని రుజువైందన్నారు. 

రైతుబంధు డబ్బులు పడ్డాయని ప్రభావితం కావొద్దని రేవంత్ రెడ్డి రైతులను కోరారు.  తమ పార్టీ అధికారంలోకి వస్తే  కేసీఆర్ ఇస్తున్న దాని కంటే  మరో రూ. 5 వేలు అదనంగా ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. 

కాంగ్రెస్ అభ్యర్ధులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,వివేక్ పై ఐటీ, ఈడీ దాడులు  రెండు పార్టీల మధ్య ఒప్పందంలో భాగమేనని ఆయన  ఆరోపించారు. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఏకే గోయల్ నివాసంలో  రూ. 300 కోట్ల డబ్బులున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన  ఆరోపించారు. ఈ విషయమై  తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి  వికాస్ రాజ్ తో మాట్లాడేందుకు  తనతో పాటు  మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  ఫోన్ చేసినట్టుగా ఆయన  చెప్పారు. కానీ, వికాస్ రాజ్ మాత్రం  ఫోన్ లిఫ్ట్ చేయలేదని  రేవంత్ రెడ్డి  తెలిపారు.

 

ఈ విషయమై ఆందోళన చేస్తున్న తమ పార్టీ కార్యకర్తలపై  పోలీసులు లాఠీ చార్జీ చేయడాన్ని రేవంత్ రెడ్డి తప్పు బట్టారు.బీజేపీ లో ఉంటే వివేక్ మంచిబాలుడు ...కాంగ్రెస్ లో ఉంటే రావణాసురుడు అనే రీతిలో వ్యవహరిస్తున్నారని  రేవంత్ రెడ్డి  మండిపడ్డారు. కేసీఆర్ పై బీజేపీ చర్యలు తీసుకోవట్లేదని వివేక్ ఆ పార్టీ నుండి బయటకు వచ్చినట్టుగా  రేవంత్ రెడ్డి  చెప్పారు.ఈ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ తో పోటీ కాదు ..ఈడీ ,ఐటీ తో తమకు ఈ ఎన్నికల్లో పోటీ ఉందన్నారు.

also read:Narendra Modi...సకల జనుల సౌభాగ్య తెలంగాణ లక్ష్యం: కామారెడ్డి సభలో నరేంద్ర మోడీ

రైతు బంధు  పథకం కింద  లబ్దిదారులకు  నిధులు పంపిణీకి  ఈ నెల  24న  ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  ఈ విషయమై  ఆయన స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో  ఈ దఫా అధికారాన్ని హస్తగతం  చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ  అన్ని అస్త్రాలను  ప్రయోగిస్తుంది.  కర్ణాటక తరహా ఫార్మూలాను  కాంగ్రెస్ అమలు చేస్తుంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios