Asianet News TeluguAsianet News Telugu

Telangana Election Results: ఆరు గ్యారెంటీలే కాంగ్రెస్ ని గెలిపించాయా?

2014లో కేవలం 19 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. ఆ తర్వాత  2018లో 21 సీట్లు గెలుచుకుంది. ఈ సారి మాత్రం ఫుల్ మెజార్టీ సాధించి, అధికారం చేపట్టడానికి రెడీ అయ్యింది. అయితే,  కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో సత్తా చాటడానికి ఆ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారేంటీలే కారణం అని తెలుస్తోంది.

These guarantees helps Congress To won In Telangana Assembly Elections ram
Author
First Published Dec 3, 2023, 1:02 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరి కాసేపట్లో విడుదల కానున్నాయి. ఇప్పటికే కౌంటింగ్ జోరుగా సాగుతోంది. దాదాపు విజయం కాంగ్రెస్ ని వరించినట్లే అని స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఎన్నికల్లోనూ గెలిచి మూడోసారి తెలంగాణలో అధికారం చేపడతామని ధీమాగా ఉన్న సీఎం కేసీఆర్ కి కాంగ్రెస్ ఊహించని షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారం విషయంలోనూ బీఆర్ఎస్ నిర్లక్ష్యంగా వ్యవహరించింది అనే కామెంట్స్ కూడా వినపడుతున్నాయి. బీఆర్ఎస్ ఓటమికి కారణాలు పక్కన పెడితే, కాంగ్రెస్ విజయానికి గల కారణాల గురించి మాత్రం తెలుసుకోవాల్సిందే. 


కాంగ్రెస్ ఈ సారి ఎన్నికల్లో విజయం సాధించేందుకు చాలానే కష్టపడింది. తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ అయినా ఎక్కువ క్రెడిట్ కేసీఆర్ ఖాతాలోకి వెళ్లిపోయింది. అందుకే  2014లో కేవలం 19 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. ఆ తర్వాత  2018లో 21 సీట్లు గెలుచుకుంది. ఈ సారి మాత్రం ఫుల్ మెజార్టీ సాధించి, అధికారం చేపట్టడానికి రెడీ అయ్యింది. అయితే,  కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో సత్తా చాటడానికి ఆ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారేంటీలే కారణం అని తెలుస్తోంది.

ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచి ప్రజల్లోకి తమ మేనిఫోస్టోని ముఖ్యంగా ఆరు గ్యారెంటీలను తీసుకువెళ్లడానికి ఎక్కువ కృషి చేశారనే చెప్పొచ్చు. మధ్యతరగతి ప్రజలకు  కనెక్ట్ అయ్యేలా ఈ ఆరు గ్యారెంటీలను తయారు చేశారు. గ్యాస్ సిలిండర్‌ను రూ.500కే ఇస్తామని కాంగ్రెస్ భరోసా ఇచ్చింది. రైతుల సంక్షేమం కోసం ఏటా ఎకరానికి రూ.15 వేలు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది. కళ్యాణలక్ష్మీ కింద లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పారు. ఇవన్నీ పేద, మధ్యతరగతి ప్రజలకు బాగా చేరువయ్యాయనే టాక్ ఎక్కువగా వినపడుతోంది. 

కాంగ్రెస్ ప్రభుత్వం.. జనాల్లోకి తీసుకువెళ్లిన గ్యారెంటీలు ఏంటో ఓసారి చూద్దాం....

కళ్యాణ లక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.2,500, తులం బంగారం 
పేద మహిళలకు రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు సాయం
చేయూత పథకం కింద రూ.10 లక్షల ఆరోగ్య బీమా
యువ వికాసం కింద విద్యార్థులకు రూ.5 లక్షల వరకు సాయం.
చేయూత కింద నెలకు రూ.4వేల పింఛను
రైతు భరోసా కింద ఏటా రైతుకు రూ.15 వేలు. కౌలు రైతులకు కూడా పథకం వర్తింపు
భూమి లేని నిరుపేదలు, కూలీలకు ఏటా రూ.12 వేలు
వరి పండించే రైతులకు మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌
 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల లైవ్ అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us:
Download App:
  • android
  • ios