Asianet News TeluguAsianet News Telugu

Telangana CM: సీఎం ఎంపిక ఇవ్వాళ లేనట్టే?.. భిన్నాభిప్రాయాలా? డిసెంబర్ 9 దాకా వెయిటింగా?

తెలంగాణ నూతన సీఎం కోసం ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రోజు సీఎల్పీ సమావేశంలో ఇది తేలుతుందని, రాత్రిపూట ప్రమాణ స్వీకారం జరుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ, ప్రస్తుత పరిణామాలు మాత్రం ఈ రోజు సీఎం ఎంపిక లేనట్టేననే సంకేతాలు వెల్లడిస్తున్నాయి.
 

telangana new cm, congress cm choose delayed, high command to take decision tomorrow kms
Author
First Published Dec 4, 2023, 6:36 PM IST

హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల్లో 64 స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్ ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో బిజీ అయిపోయింది. నిన్న రాత్రే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజధాని నగరం హైదరాబాద్ చేరుకున్నారు. ఈ రోజు సీఎల్పీ సమావేశం సుదీర్ఘంగా జరిగింది. అయితే.. సీఎల్పీ సమావేశం జరిగినా సీఎం అభ్యర్థి వ్యవహారం ఇంకా సస్పెన్స్‌లోనే ఉన్నది. అసలు ఈ రోజు సీఎం ఎంపిక లేనట్టేనని తెలుస్తున్నది.

ఎల్లా హోటల్‌ నుంచి డీకే శివకుమార్ బయటకు వచ్చారు. ఇతర పరిశీలకులూ బయటకు వచ్చారు. ఈ అబ్జర్వర్లు ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో రేపు ఢిల్లీలో సమావేశం అవుతారు. ఈ సమావేశంలోనే సీఎం ఎవరు అనేది తేలనున్నట్టు సమాచారం. ఈ మేరకు డీకే శివకుమార్ ఢిల్లీకి బయల్దేరినట్టు తెలిసింది.

Also Read : Revanth Reddy: రేవంత్ రెడ్డికి 2004లో కేసీఆర్ టీఆర్ఎస్ టికెట్ ఇచ్చి ఉంటే..!

ఈ రోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారనే సమాచారం వచ్చింది. కానీ, ఇప్పుడు పరిస్థితులు మాత్రం అలా లేవు. కాంగ్రెస్ అధిష్టానం ఈ రోజు నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో కాంగ్రెస్ వ్యవహారంపైనా సందేహాలు వస్తున్నాయి.

Also Read: తెలంగాణలో కాంగ్రెస్‌తోపాటు బీఆర్ఎస్ కూడా గెలిచింది!!

కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థులకు కొదువ లేదనే విమర్శ ఇది వరకు ఉన్నదే. ఈ నేపథ్యంలోనే సీఎం ఎంపికలో భిన్నాభిప్రాయాలు వచ్చాయా? ఎక్కువ మంది పోటీ చేస్తున్నారా? అనే అనుమానాలు వస్తున్నాయి. అంతేకాదు, ఈ ఎంపిక వ్యవహారం వాయిదా పడటానికి మరో కారణాన్ని కూడా అనుమానిస్తున్నారు. సోనియా గాంధీ జన్మదినం, ప్రత్యేక తెలంగాణకు తొలి ప్రకటన వెలువడిన డిసెంబర్ 9వ తేదీని రేవంత్ రెడ్డి పలుమార్లు ప్రస్తావించారు. ఆ రోజునే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని, అదే రోజు ప్రమాణం చేస్తామనే మాట చెప్పారు. దీంతో సీఎం వ్యవహారంపై భిన్నాభిప్రాయాల వల్ల వాయిదా వేశారా? లేక డిసెంబర్ 9వ తేదీ కోసం వెయిట్ చేస్తున్నారా? అనే సందేహాలు వస్తున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios