ఢిల్లీ కాలుష్యం హైదరాబాద్‌ను కమ్మేసింది.. మరో మూడు రోజులు భరించాల్సిందే : హరీశ్‌రావు సెటైర్లు

ఢిల్లీ కాలుష్యం హైదరాబాద్‌ను కమ్మేసిందని సెటైర్లు వేశారు తెలంగాణ ఆర్ధిక మంత్రి , బీఆర్ఎస్ అగ్రనేత హరీశ్ రావు. బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందని.. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే మరోసారి కరెంట్ కోతలు తప్పవని ఆయన హెచ్చరించారు.

telangana minister harish rao satires on congress and bjp at brs praja ashirvada sabha in rajendra nagar ksp

విపక్షాలపై విమర్శలు గుప్పించారు తెలంగాణ ఆర్ధిక మంత్రి , బీఆర్ఎస్ అగ్రనేత హరీశ్ రావు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాజేంద్రనగర్‌లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగిస్తూ.. ఢిల్లీ కాలుష్యం హైదరాబాద్‌ను కమ్మేసిందని సెటైర్లు వేశారు. ఈ కాలుష్యాన్ని మరో మూడు రోజులు భరించాల్సి వుంటుందని హరీశ్ అన్నారు.

బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందని.. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే మరోసారి కరెంట్ కోతలు తప్పవని ఆయన హెచ్చరించారు. గడిచిన పదేళ్ల కాలంలో హైదరాబాద్‌ ఎంతో అభివృద్ధి చెందిందని , ఒకప్పుడు రాను బిడ్డో సర్కార్ దవాఖానాకు అని పాటలు పాడేవారమని హరీశ్ రావు గుర్తుచేశారు. బీఆర్ఎస్ మళ్లీ గెలిచాక పేదలకు ఇళ్లు కట్టిస్తామని.. ప్రజలు ఆలోచించి సరైన అభ్యర్ధికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. 

అంతకుముందు జగిత్యాలలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ.. ఇందిరమ్మ రాజ్యంలో 400 మందిని కాల్చి చంపారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి మీ ముందే వుందని, ఆలోచించి ఓటు వేయాలని కేసీఆర్ కోరారు. ఇందిరమ్మ రాజ్యంలో ఘోరమైన పరస్థితులు వుండేవని.. ఆ సమయంలో ఏ వర్గంలోని ప్రజలు కూడా బాగుపడలేదని కేసీఆర్ దుయ్యబట్టారు. ఇందిరమ్మ రాజ్యంలోనే అత్యవసర పరిస్థితి విధించి ప్రజలను ఇబ్బంది పెట్టారని సీఎం ధ్వజమెత్తారు. అలాంటి ఇందిరమ్మ రాజ్యాన్ని మళ్లీ తెస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని కేసీఆర్ చురకలంటించారు. 

ALso Read: ఆ పార్టీలో 12 మంది సీఎంలు.. కాంగ్రెస్‌కు ఓటేస్తే , నా పదేళ్ల కష్టం వృథాయే : కేసీఆర్ వ్యాఖ్యలు

రూ.200 వున్న పింఛన్‌ను రూ.2 వేలకు పెంచామని ముఖ్యమంత్రి తెలిపారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే పింఛన్ రూ.5 వేలకు పెంచుతామని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణలో ప్రస్తుతం రైతు రాజ్యం వుందని. మూడేళ్ల కష్టపడి ధరణి పోర్టల్ తీసుకొచ్చామని సీఎం తెలిపారు. కౌలుదారుడు రెండు, మూడేళ్లు సాగు చేస్తే రైతు భూమి గోల్ మాల్ అవుతుందని కేసీఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే.. పదేళ్లు తాను పడిన కష్టం వృథా అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్లేనని.. ఆ పార్టీలో 12 మంది సీఎంలు వున్నారని కేసీఆర్ సెటైర్లు వేశారు. 

అంతకుముందు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన తరువాత అసలు ఒక్క జాబ్ నోటిఫికేషన్ అయినా విడుదల చేశారా అని అన్నారు. ఐటీ రైడ్ లు కాంగ్రెస్ నాయకులపై మాత్రమే కొనసాగుతున్నాయని చెప్పడం వాస్తవం కాదని అన్నారు. రాష్ట్రానికి స్వీయ పాలనే శ్రీరామ రక్ష అని మంత్రి కేటీఆర్ తెలిపారు. వచ్చే నవంబర్ 29వ తేదీన దీక్షా దినాన్ని ఘనంగా జరుపుకుంటామని తెలిపారు. సీఎం కేసీఆర్ దీక్షతోనే నవంబర్ 29న అప్పటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై కీలక ప్రకటన చేసిందని చెప్పారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios