Telangana Exit poll Results 2023:తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఇవాళ పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఆయా సర్వే సంస్థలు విడుదల చేయనున్నాయి. తెలంగాణతో పాటు మిగిలిన రాష్ట్రాలకు చెందిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడి కానున్నాయి.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీకి ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకోనేందుకు మూడు ప్రధాన పార్టీలు అన్ని అస్త్రశస్త్రాలను ప్రయోగించాయి. తెలంగాణ రాష్ట్రంలో మూడో దఫా అధికారాన్ని దక్కించుకోవాలని భారత రాష్ట్ర సమితి ప్రయత్నిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రెండు దఫాలు కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైంది. ఈ దఫా తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహత్మకంగా ముందుకు వెళ్లింది. దక్షిణాదిలో తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవాలని కమలదళం అడుగులు వేసింది. తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ జాతీయ నాయకత్వం కూడ ఫోకస్ పెట్టింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు ఆ పార్టీకి చెందిన అగ్ర నేతలు కూడ రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. బీఆర్ఎస్ 119 అసెంబ్లీ స్థానాల్లో బరిలోకి దిగింది. కాంగ్రెస్ పార్టీ 118 స్థానాల్లో తన అభ్యర్ధులను పోటీకి దింపింది. ఒక్క స్థానాన్ని సీపీఐకి కేటాయించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం అసెంబ్లీ స్థానాన్ని సీపీఐకి కేటాయించింది.
తెలంగాణ ాలో బీజేపీ, జనసేన మధ్య పొత్తు కుదిరింది. రాష్ట్రంలోని 111 స్థానాల్లో బీజేపీ, ఎనిమిది స్థానాల్లో జనసేన అభ్యర్థులు బరిలోకి దిగారు. బీజేపీ, జనసేన అభ్యర్థుల తరపున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
also read:Nagarjuna Sagar పై రాజకీయ నేతలు వ్యాఖ్యలు చేయవద్దు: వికాస్ రాజ్
తెలంగాణ అసెంబ్లీతో పాటు ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్,మిజోరం రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవాళ సాయంత్రం ఆరు గంటల తర్వాత విడుదల కానున్నాయి. తెలంగాణలో ఇవాళ సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కు సమయం. ఐదు గంటల వరకు పోలింగ్ స్టేషన్లలో క్యూలో ఉన్న వారికి ఓటు హక్కును వినియోగించుకొనే అవకాశం ఉంటుంది.
తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఇవాళ సాయంత్రం ఆరు గంటల తర్వాత ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉంది.