నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద చోటు చేసుకున్న పరిణామాలపై  తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి  వికాస్ రాజ్  స్పందించారు.  ఈ విషయాన్ని పోలీసులు చూసుకుంటారని ఆయన తేల్చి చెప్పారు.

హైదరాబాద్:నాగార్జునసాగర్ ప్రాజెక్టు విషయంలో  పోలీసులు చూసుకుంటారని  తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి  వికాస్ రాజ్ చెప్పారు. 

నాగార్జునసాగర్ డ్యామ్ పై  అక్రమంగా చొరబడి   ఆంధ్రప్రదేశ్ పోలీసులు ముళ్ల కంచెను ఏర్పాటు చేశారు. డ్యామ్  13వ గేటు వద్దకు చేరుకుని ముళ్ల కంచెను  ఏర్పాటు చేసి డ్యామ్ ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.  దీంతో ఉద్రిక్తత నెలకొంది.ఈ విషయం తెలిసిన  మిర్యాలగూడ డీఎస్పీ  నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్దకు చేరుకుని ఆంధ్రప్రదేశ్ పోలీసులతో మాట్లాడారు.

ఈ విషయమై  తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ స్పందించారు. రాజకీయ నాయకులు తొందరపడి వ్యాఖ్యలు చేయవద్దని ఆయన సూచించారు.నేతలెవరూ కూడ  నిబంధనలను అతిక్రమించవద్దని ఆయన సూచించారు. తెలంగాణలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుందని ఆయన  చెప్పారు.